ధరణిలో ఆస్తుల నమోదు కేసుపై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. విచారణ అనంతరం రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని చెప్పలేదని, పాత విధానంలో రిజిస్ట్రేషన్లను చేసేందుకు అభ్యంతరం లేదని హైకోర్టు ఇప్పటికే స్పష్టంచేసింది.
ఈ నేపథ్యంలో ధరణిలో కాకుండా పాత విధానంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను ప్రారంభించేస్తే ఎలా చేయాల్సి ఉంటుందనే అంశంపై రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చర్చించారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్‌లో వ్యవసాయేతర ఆస్తుల అంశాన్ని, వ్యవసాయేతర సహా ఇతర రిజిస్ట్రేషన్‌లను ప్రయోగాత్మకంగా పరిశీలించినట్లు తెలిసింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రారంభంపై నేడు ప్రభుత్వం అధికారికంగా స్పష్టత ఇస్తుందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.