ETV Bharat / city

Deceased Farmers Families : 250 రైతు కుటుంబాల కన్నీటి కథలు - Telangana Farmers Suicide 2021

Deceased Farmers Families : సాగు సంక్షోభం, అప్పుల బాధలతో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో మొదలైన రైతుల చావులు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆగడంలేదు. ఇంటి పెద్దదిక్కు కోల్పోయిన ఎన్నో కుటుంబాలు రోడ్డునపడి దయనీయస్థితిలో కొట్టుమిట్టాడుతోన్నాయి. హైదరాబాద్‌లో రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన "ప్రజా దర్బార్‌"లో బాధిత కుటుంబాలు తమ గోడు వినిపించాయి.

Deceased Farmers Families
Deceased Farmers Families
author img

By

Published : Dec 17, 2021, 9:53 AM IST

Updated : Dec 17, 2021, 10:06 AM IST

250 రైతుల కుటుంబాల కన్నీటి కథలు

Deceased Farmers Families : రాష్ట్రంలో రైతు వెతలు మరోసారి తెరపైకి వచ్చాయి. సాగు సంక్షోభం, అప్పుల బాధలతో చనిపోయిన రైతుల కుటుంబాల కన్నీటి కథలు ఆవేదన కలిగించాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత వ్యవసాయంలో నష్టాలొచ్చి 7వేల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు సాయం అందించి ఆదుకోవాలంటూ బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి. ప్రభుత్వం 194 జీవో ప్రకారం వెంటనే పరిహారం చెల్లించాలంటూ హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. కార్యక్రమంలో రైతు ఆత్మహత్యలు - బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపులపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి బాధిత రైతు కుటుంబాల మహిళలు తరలివచ్చి.. తమ ఇంటిపెద్దను కోల్పోయాక ఎదుర్కొన్న పరిస్థితులను, పడుతున్న బాధలను వివరించారు. 250 కుటుంబాల మహిళలు తమ గోస వినిపించి కన్నీటి పర్యంతమయ్యారు.

అధికశాతం కౌలుదారులే..

Deceased Farmers Families Telangana : ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో అధిక శాతం కౌలుదారులే. బ్యాంకు రుణాలు, రైతుబంధు, బీమా సదుపాయం లేక.. కౌలురైతులు సాగు చేసి మరింత అప్పుల్లో కూరుకుపోతున్నారు. రుణాలు తీర్చలేక ఒక్కో కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు చనిపోతున్నారు. ఏళ్లు గడుస్తున్నా పరిహారం అందడంలేదని బాధిత మహిళా రైతులు వాపోయారు.

పరిహారం చెల్లించాలి..

Telangana Farmers Suicide : తెలంగాణ ఏర్పడ్డాక చనిపోయిన రైతు కుటుంబాలకు 6 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి ఏపీ హయాంలో ఉన్న 421 జీవోకు ప్రత్యామ్నాయంగా.. 173, 194 జీవోలు ఉన్నప్పటికీ.. అవి పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలను గుర్తించి పరిహారం చెల్లించాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

రాష్ట్రం నలుమూలలా జరుగుతున్న రైతు ఆత్మహత్యల విషాద ఘటనలు రాజధానిలో ప్రతిధ్వనించాయి.

Last Updated : Dec 17, 2021, 10:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.