ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన చెన్ను గోపీచంద్ పదిరోజుల క్రితం చనిపోయారు. అతని కుటుంబ సభ్యులు సంప్రదాయం ప్రకారం విశిష్ట అద్వైత పురోహితుని ఆధ్వర్యంలో కర్మకాండలు జరిపించాలని నిర్ణయించారు. అయితే లాక్డౌన్తో పురోహితులు అందుబాటులో లేకపోవడం వల్ల వారికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో కృష్ణా జిల్లా అవనిగడ్డలోని పండితుడు వారి వేదనను గుర్తించి వారికి వాట్సాప్ వీడియో కాల్లో మంత్రాలు చదివి వినిపిస్తుండంగా వారు గుంటూరు జిల్లాలో శ్రాద్ధకర్మల తంతు పూర్తి చేశారు. తమ ఆత్మీయుని ఆత్మకు శాంతి కలిగేలా పండితుని ఆధ్వర్యంలో ఈ విధంగా కర్మక్రియలు జరిపించడంపై మృతుని బంధువులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి..