విశాఖ జిల్లా తగరపువలస గోస్తనీ నది సమీపంలోని దుర్గాదేవి ఆలయం వద్ద అగ్నిగుండ మహోత్సవం ఘనంగా జరిగింది. గురు భవాని కుసుమ హరి ఆధ్వర్యంలో భక్తులు అగ్నిగుండ ఉత్సవంలో పాల్గొన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో దసరా రోజున తగరపువలస పురవీధుల్లో భవానీలు పెద్ద సంఖ్యలో కలశాలతో అమ్మవారి నామస్మరణ చేస్తూ ఊరేగింపుగా దుర్గాదేవి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం శరణ ఘోషతో అగ్ని గుండాన్ని తొక్కారు. భక్తులు సైతం ఉత్సాహంగా అగ్నిగుండం కార్యక్రమంలో పాల్గొన్నారు. 25 ఏళ్ల నుంచి నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని భవానీలు నిర్వహిస్తుండటం విశేషం.
- ఇదీ చూడండి : దేవరగట్టులో నెత్తురోడింది!