India world record: ఆంధ్రప్రదేశ్ అనంతపురం నగరానికి చెందిన కత్తి విజయ్ కుమార్ నృత్య శిక్షకుడిగా మంచి పేరున్న వ్యక్తి. ఎంతోమంది శిక్షకులను తయారుచేసిన ఘనత ఇతనిది. ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి ఏదో ఒక రకమైన వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించి దేశభక్తిని చాటుకుంటారు. గతంలోనూ 75 మంది స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలను గీసి ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డులు స్థానం సంపాదించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఆజాదిక అమృత మహోత్సవ' కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ 75 దేశభక్తి గీతాలకు నృత్యం చేసి అందర్నీ ఆకర్షించారు. భారత్ వరల్డ్ రికార్డు నేషనల్ కోఆర్డినేటర్ నరేంద్ర గౌడ్ రికార్డింగ్ జ్ఞాపికను అందించారు. భారత్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించిన ఈయనకు తోటి నృత్య శిక్షణ కారులు, కళాకారులు అభినందనలు తెలిపారు.
ఇవీ చదవండి : 'వెంకయ్య సాక్షిగా అనేక చారిత్రక ఘటనలు.. ఆయన దక్షతకు జోహార్లు'