ETV Bharat / city

శ్రీవారి సేవలో దగ్గుబాటి కుటుంబం.. శ్రీకాళహస్తీలో పీవీ సింధు - శ్రీకాళహస్తీశ్వరస్వామిని దర్శించుకున్న పీవీ సింధు

తిరుమల శ్రీవారిని దగ్గుబాటి కుటుంబ సభ్యులు దర్శించున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. మరోవైపు శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని భారత్​ స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు దర్శించుకున్నారు.

తిరుమల
తిరుమల
author img

By

Published : Sep 15, 2022, 4:50 PM IST

తిరుమల శ్రీవారిని సినీనటుడు రానా, నిర్మాత సురేష్‌బాబు దంపతులు కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం తితిదే వేదపండితులు రంగనాయకుల మండపంలో ప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం బయటకు వస్తున్న రానాతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు.

మరోవైపు శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు దర్శించుకున్నారు. ఆలయ ఈవో ఆమెకు స్వాగతం పలికారు. శ్రీ మేథోగురు దక్షిణామూర్తి సన్నిధిలో అర్చకులు సింధుకు వేద ఆశీర్వచనం అందజేశారు. తీర్థ ప్రసాదాలు జ్ఞాపికలు అందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు దక్కాలని ప్రార్థించినట్లు సింధు తెలిపారు. పూర్తిస్థాయిలో శ్రమిస్తేనే క్రీడాకారులకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. భావి క్రీడాకారులకు తనవంతు సహకారం అందిస్తానని పీవీ సింధు పేర్కొన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న దగ్గుబాటి కుటుంబం.. శ్రీకాళహస్తీలో పీవీ సింధు

ఇవీ చదవండి: millet mantra startup : 'మిల్లెట్ మాంత్రికులు' మనసు దోచేస్తున్నారు..

సుప్రీం జడ్జిల రిటైర్మెంట్ వయసు 67ఏళ్లకు.. బార్ కౌన్సిల్ కీలక నిర్ణయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.