నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు ఇటీవల భారీ స్థాయిలో పుట్టుకొస్తున్నాయి. దీనిపై చాలా వరకు ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నా... సైబర్ నేరగాళ్లు నకిలీ ఐడీలను ఏదో ఒక రూపంలో దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నకిలీ ఐడీలను సృష్టించి నగరానికి చెందిన ఓ మహిళ వ్యక్తిగత ఫోటోలను పోస్టు చేశారు. వీటిని గమనించిన ఆమె భర్త సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
మరో ఘటనలో ఓఎల్ఎక్స్లో ప్రకటనలు చూసి ఓ వ్యక్తి 56వేలు మోసపోయాడు. ఇంకో ఘటనలో బాధితుడికి సంబంధం లేకుండానే అతడి ఖాతా నుంచి 97వేల రూపాయలను సైబర్ నేరగాళ్లు కాజేశారు. ఆయా ఘటనలపై బాధితులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: ప్రభుత్వం ప్రకటన చేసింది.. జనం బారులు తీరారు..