ETV Bharat / city

curfew: ఆంధ్రప్రదేశ్​లో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు - curfew in ap

ఏపీలో ప్రస్తుతం అమల్లో ఉన్న కర్ఫ్యూను ఈ నెల 6వ తేదీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్నట్టే...రాత్రి 11 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పేర్కొంది.

curfew
curfew
author img

By

Published : Oct 3, 2021, 9:52 AM IST

కొవిడ్ కారణంగా ఏపీలో అమలవుతున్న కర్ఫ్యూను ఈ నెల 6వ తేదీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్నట్టే...రాత్రి 11 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పేర్కొంది. ప్రతి 15 రోజులకోసారి పొడిగిస్తూ వస్తున్న కర్ఫ్యూను ఈ సారి తక్కువ రోజులకే పరిమితం చేశారు. .

రోజుకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1000 లోపు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితులపై చర్చించిన అధికారులు కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వివాహాలు, మతపరమైన కార్యక్రమాలకు 50 మందికి మించి హాజరుకాకుడదని ముఖ్య కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఏపీలో కొత్తగా 865 కరోనా కేసులు.. 9 మరణాలు..

ఏపీలో కొత్తగా 50,304 పరీక్షలు నిర్వహించగా.. 865 కేసులు నిర్ధారణ(latest corona cases of ap) అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు 20,51,998 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 9 మంది మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 14195 కి చేరింది. తాజాగా 1,424 మంది బాధితులు కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 20,27,229 కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

ప్రస్తుతం ఏపీలో 10,574 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 2,84,00,471 నమూనాలను ఆరోగ్య శాఖ(covid cases in ap) పరీక్షించింది. కరోనాతో చిత్తూరు జిల్లాలో మరో ముగ్గురు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందినట్లు(covid deaths in ap) వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 172, చిత్తూరులో 168 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి: saddula Bathukamma Song 2021 : బతుకమ్మ పాటకు ఏఆర్ రెహమాన్​ సంగీతం.. గౌతమ్​ మీనన్ దర్శకత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.