రైతుబంధు పథకం సాయం రైతులందరికి అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధికారులను ఆదేశించారు. రైతుబంధు పంపిణీపై అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, భూపరిపాలనా శాఖ సంచాలకులు రజత్ కుమార్ షైనీ, టీఎస్టీఎస్ ఎండీ వెంకటేశ్వర్ రావు సమీక్షలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎటువంటి జాప్యం లేకుండా రైతులందరికీ వారి బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ అయ్యేలా చూడాలని తెలిపారు.
ఇవీ చూడండి: రోజుకు 5 వేల పరీక్షలు సాధ్యమేనా..?: హైకోర్టు