ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు రేపటి నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రత కోసం ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఈవోలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
రేపటి నుంచి వీలైనంత వరకు వచ్చే నెల ఒకటో తేదీలోగా తరగతులు ప్రారంభించాలని సీఎస్ సూచించారు. ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు 17.24 లక్షల మంది విద్యార్థులు ఉన్నట్టు వెల్లడించారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్ధాయి విద్యా పర్యవేక్షక కమిటీలు సమావేశమై తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇదీ చూడండి: రేపటి నుంచి 6, 7, 8 తరగతులు ప్రారంభం: సబిత