హైదరాబాద్‌తో పాటు రాజధాని పరిసర ప్రాంతాల్లో ఐటీ రంగాభివృద్ధి కోసం అవసరమైన బ్లూప్రింట్ తయారు చేయాలని అధికారులను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. బీఆర్కేఆర్ భవన్లో ఉప్పల్, నాగోల్, కాటేదాన్, కొంపల్లితో పాటు నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఐటీ రంగం అభివృద్ధిపై పలువురు పారిశ్రామిక వేత్తలు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్షించారు.
మంత్రి కేటీఆర్ మార్గదర్శకాలతో ఐటీ గ్రిడ్ పాలసీనీ మంత్రివర్గం రూపొందించిందని.. ఈ పాలసీ ద్వారా హైదరాబాద్‌తో పాటు రాజధాని పరిసర ప్రాంతాలలో వివిధ ఐటీ పార్క్‌ల ఏర్పాటుకు, ఇప్పటికే నగరంలో ఉన్న ఐటీ పార్క్‌లను అవుటర్ రింగ్‌రోడ్‌కు తరలించడానికి ఈ పాలసీ సహకరిస్తుందని సీఎస్ పేర్కొన్నారు. ఐటీ అభివృద్ధికి అవసరమైన మౌలిక వనరుల కల్పనకు, మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి ఈ నెల 27 లోపు సంబంధిత పరిశ్రమ వర్గాల నుంచి సలహాలు, సూచనలు సేకరించాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.
ఇవీ చూడండి: ఎన్సీడీసీకి స్థలం కేటాయించాలని కేసీఆర్‌కు కిషన్ రెడ్డి లేఖ