crocodile in sagar canal at darsi: ఏపీలోని ప్రకాశం జిల్లా దర్శి మండలం పోతవరం గ్రామ సమీపంలోని సాగర్ కాల్వలో మొసలి సంచరిస్తోంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు.. తమ ఫోన్లో మొసలి సంచారాన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రోజూ గేదెలను శుభ్రపర్చడానికి సాగర్ కాల్వలోకి తీసుకెళ్తుంటామని, ఆ సమయంలో మొసలి దాడి చేస్తే.. తమ పరిస్థితి ఏంటని భయాందోళనకు గురవుతున్నారు.
ఈ విషయంపై అటవీ అధికారులను వివరణ అడగగా.. ఇప్పటివరకు తమకు సమాచారం లేదన్నారు. మొసలి సంచరిస్తున్నట్లు సమాచారం వస్తే.. తగిన చర్యలు తీసుకుంటామని ఫోన్ ద్వారా తెలిపారు.
ఇదీ చదవండి:
Compensation Released: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం విడుదల