గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలో రైతులు తలపెట్టిన ర్యాలీని కేంద్రం, పోలీసులు అణచివేయడంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. లాఠీఛార్జీ చేసి రైతులను తీవ్రంగా గాయపర్చారని... ఈ ఘటనలో ఉత్తరాఖండ్‌కు చెందిన నవనీత్‌సింగ్ అనే రైతు మరణించడం చాలా బాధాకరమన్నారు. రైతు మృతికి సంతాపం, వారి కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా భేషజాలకు పోకుండా రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పోరాటానికి మద్దతుగా హైదరాబాద్‌లో తలపెట్టిన వాహన ర్యాలీకి తెరాస ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందన్నారు. ఈ ర్యాలీకి ప్రజలు భారీ ఎత్తున హాజరై... విజయవంతం చేశారన్నారు. విజయవంతం చేసిన రాజకీయ పార్టీలు, రైతుసంఘాలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలకు తమ్మినేని ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి : ట్రాక్టర్ ర్యాలీతో రణరంగంగా మారిన దిల్లీ