CPM leaders will meet with KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సీపీఎం నేతలు భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు ప్రగతి భవన్‌కు వెళ్లారు. ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తెరాసకు సీపీఎం మద్దతు ప్రకటించిన తర్వాత తొలిసారి సీఎంతో సమావేశం కావడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు తాజా రాజకీయాలపైన చర్చిస్తున్నారు.
భాజపాకు వ్యతిరేకంగా కేసీఆర్ చేస్తున్న పోరాటాన్ని స్వాగతిస్తున్నామని చెప్పి, ఈ ఎన్నికలో తమ మద్దతు తెరాస పార్టీకే ఉంటుందని మునుగోడు సభకు ముందు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఈ ఒక్క ఎన్నికలో మాత్రమే తెరాస పార్టీకి మద్దతు ఇస్తామని సమావేశంలో తెలిపారు. దీంతో ఆయన ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామాతో.. ఉపఎన్నిక అనివార్యమైంది. అందులోనూ.. రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ను వీడి భాజపాలో చేరటంతో.. రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్కు అడ్డాగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో.. కలవరం మొదలైంది. ఈ ఉపఎన్నికలో ఎలాగైనా సత్తా చాటాలని.. భాజపా, తెరాస పార్టీలు ఇప్పటికే పావులు కదుపుతున్నాయి.జెండా మారినా.. బ్రాండ్ వ్యాల్యూతో భాజపా నుంచి అభ్యర్థిగా రాజగోపాల్రెడ్డి మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. అటు అధికార పార్టీ.. కూడా మునుగోడులో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ రెండు పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు, సభలతో బలప్రదర్శన చేస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా ఒడిసిపట్టుకుని ఉనికి చాటుకోవాలనుకుంటోన్న హస్తం పార్టీ.. అభ్యర్థి విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.
ఇవీ చదవండి: