ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తెలిపారు. ఉద్యోగం, జీతాల బాధతో కొందరు కార్మికుల గుండెలు ఆగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సాధనలో కీలకంగా వ్యవహరించిన వారినే కేసీఆర్ అణగదొక్కుతున్నారని చెప్పారు. ఆర్టీసీకి ప్రభుత్వం రాయితీలను సక్రమంగా చెల్లిస్తే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఆయన అభిప్రాయ పడ్డారు. డీజిల్‌పై అధిక పన్నులు విధిస్తూ, ఛార్జీలు పెంచకుండా ఆర్టీసీని నష్టాలపాలు చేశారని తెలిపారు. ఆర్టీసీ ఆస్తులను కాజేసేందుకే సీఎం కేసీఆర్ కుట్ర పన్నారని ఆరోపించారు.
"ఆర్టీసీ వ్యాపార సంస్థ కాదు.. లాభనష్టాలు చూసుకోవడానికి..." - kunamneni sambasivarao
ఆర్టీసీకి ప్రభుత్వం రాయితీలను సక్రమంగా చెల్లిస్తే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని సీపీఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ వ్యాపార సంస్థ కాదని, ప్రజా రవాణా వ్యవస్థ అనే విషయాన్ని సీఎం గుర్తుంచుకోవాలని సూచించారు. హైదరాబాద్లో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆమరణ దీక్షను సురవరం ప్రారంభించారు.