బాబ్రీ మసీదు కూల్చివేతపై సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పు దురదృష్టకరమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆధారాలు లేవని నిర్దోషులుగా తీర్పివ్వడం దివాళాకోరుతనమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకంటే మించిన అపరాధం మరొకటి లేదన్న ఆయన... లౌకిక, ప్రజాస్వామ్య, న్యాయవ్యవస్థకు చీకటి రోజుగా అభివర్ణించారు. భారత, ప్రపంచ ప్రజానీకం జీర్ణించుకోలేని అంశంగా పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'బాబ్రీ' తీర్పుపై న్యాయ విభాగాన్ని సంప్రదిస్తాం: సీబీఐ