హేమంత్ హత్యకు గురవ్వడంలో పోలీసుల వైఫల్యం కనిపిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. చందానగర్‌లోని హేమంత్ నివాసానికి వచ్చిన నారాయణ... కుటుంబసభ్యులను పరామర్శించారు.
జూన్ 16 తర్వాత తమకు ప్రాణహాని ఉందని అవంతి పోలీసులకు ఫిర్యాదు చేసినా... పట్టించుకోలేదని అగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుపడేదిగా ఉందన్న నారాయణ... ఇది సర్కారు హత్యగా అభిప్రాయపడ్డారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: పరువు హత్య: పరారీలో ఉన్న కీలక నిందితుల అరెస్ట్