ETV Bharat / city

'ఆర్టీసీ సమ్మెపై పంతాలకు పోకుండా నిర్ణయం తీసుకోండి' - tsrtc latest news on strike

ఆర్టీసీ సమ్మెపై తెరాస సర్కారు​... ఎస్మా యాక్ట్​ అంటూ పంతాలకు పోకుండా చర్చించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని సీపీఐ నేత నారాయణ విజ్ఞప్తి చేశారు.

'ఆర్టీసీ సమ్మెపై పంతాలకు పోకుండా నిర్ణయం తీసుకోండి'
author img

By

Published : Oct 5, 2019, 4:49 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆర్టీసీ సమ్మెను పక్కదారి పట్టించడానికి, కాలయాపన చేయడానికే త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. ఎప్పుడో పరిష్కరించాల్సిన ఈ అంశాన్ని కాలయాపన చేస్తూ ఇన్ని రోజులు ఆపారని విమర్శించారు. రవాణా మంత్రి నాకేం తెలియదని... అంతా ముఖ్యమంత్రికే తెలుసని చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. ఎస్మా యాక్ట్​ అని పంతాలకు పోకుండా వెంటనే చర్చించి దీనిపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. దిల్లీకి వెళ్లి ప్రధానిని, అమిత్​షాను కలిసిన కేసీఆర్​ యురేనియం విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన ప్రభుత్వం ప్రధానితో ఎందుకు చర్చించలేదన్నారు.

'ఆర్టీసీ సమ్మెపై పంతాలకు పోకుండా నిర్ణయం తీసుకోండి'

ఇవీ చూడండి: 'సాయంత్రం 6 వరకు విధుల్లో చేరకుంటే ఉద్యోగులు కారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.