లాక్డౌన్లో వలస, పేద కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వారికి పూర్తి స్థాయిలో సాయం జరగడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. కామ్రెడ్ లెనిన్ 150 జయంతిని తన ఇంటిలోనే నిర్వహించారు. గతంలో దేశవ్యాప్తంగా లెనిన్ జన్మదిన వేడుకలను పెద్ద ఎత్తున జరపాలని పిలుపునిచ్చామని... కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమ ఇంటిలోనే జరుపుకుంటున్నామన్నారు. ఇది కరోనాపై పోరాడాల్సిన సమయమని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 12 రాష్ట్రాల్లోనే 92 శాతం 'వైరస్' కేసులు