తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరవలేనిదని సీపీఐ నేత నారాయణ గుర్తు చేశారు. అలాంటి వారు ఆత్మహత్యలకు పాల్పడడం బాధాకరమన్నారు. హైదరాబాద్ కార్వాన్లో ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కండక్టర్ సురేందర్ గౌడ్ అంత్యక్రియలకు ఆయన హాజరయ్యారు. ఆర్టీసీ కార్మికులకు తామందరం అండగా ఉంటామని తెలిపారు. బలవన్మరణాలు సమస్యకు పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు. బాధితులకు రూ. కోటి పరిహారం, వారి పిల్లలకు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇవీచూడండి: సమ్మె విరమించి చర్చలకు రండి: తెరాస పార్లమెంటరీ నేత కేకే