ETV Bharat / city

Covid Test Kits: ఇంట్లోనే ఒంట్లో యాండీబాడీలు గుర్తించేలా టెస్ట్​ కిట్!

Covid Test Kits: వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత శరీరంలో యాంటీబాడీలు ఏ స్థాయిలో ఉన్నాయి.. బూస్టర్ డోస్ అవసరమా అనే విషయాలను నిర్ధారించుకోవడానికి రెండు టెస్ట్​ కిట్స్​ను రూపొందించినట్లు అంకుర సంస్థ రీజీన్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. లాలాజలం ద్వారా రక్తంలో కొవిడ్ యాంటీబాడీ స్థాయిని తెలుసుకోవచ్చని పేర్కొంది.

covid test kit
covid test kit
author img

By

Published : Apr 1, 2022, 6:55 AM IST

Covid Test Kits: లాలాజలం ద్వారా రక్తంలో కొవిడ్ యాంటీబాడీలను తెలుసుకొనేందుకు రెండు టెస్ట్​ కిట్లను హైదరాబాద్​లోని ఓ అంకుర సంస్థ ఆవిష్కరించింది. ఇంట్లోనే సొంతంగా యాంటీబాడీలను గుర్తించేలా ఓ విధానం.. డయాగ్నస్టిక్స్ కేంద్రంలో పరీక్ష కోసం మరో విధానాన్ని కనిపెట్టింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఇంకుబేషన్ కేంద్రంలోని అంకుర సంస్థ రీజీన్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వీటిని ఆవిష్కరించింది.

covid test kit
కరోనా టెస్ట్​ కిట్​

ఫాస్ట్ ఫ్లో స్పాట్ పరీక్షను ఇంట్లోనే సొంతంగా చేసుకోవచ్చునని.. ఫలితంగా శరీరంలోని యూంటీబాడీలను గుర్తించవచ్చని సదరు అంకుర సంస్థ రిజీన్​ ఇన్నోవేషన్స్​ తెలిపింది. పరీక్ష కిట్​ను ఒకసారి మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. డయాగ్నస్టిక్స్ కేంద్రాల్లో కిట్​ను అనేక సార్లు వినియోగించి లాలాజలం ద్వారా యాంటీ బాడీలను గుర్తించేందుకు ఎలీసా అనే విధానాన్ని రూపొందించినట్లు పేర్కొంది.

covid test kit
కరోనా టెస్ట్​ కిట్​

వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత శరీరంలో యాంటీబాడీలు ఏ స్థాయిలో ఉన్నాయి.. బూస్టర్ డోస్ అవసరమా అనే విషయాలను నిర్ధారించుకోవడానికి ఈ రెండు పరీక్షలు ఉపయోగపడతాయని అంకుర సంస్థ ప్రతినిధులు డాక్టర్ ఉదయ్ సక్సేనా, సుబ్రహ్మణ్యం వంగల తెలిపారు. పరీక్షలకు పేటెంట్ పొంది, వాణిజ్య అవసరాలకు ఉత్పత్తి చేసేందుకు అమెరికాకు చెందిన కొవిడ్ ఉత్పత్తుల సంస్థ లే సైన్స్​తో రీజీన్ ఇన్నోవేషన్స్ ఒప్పందం చేసుకుందని వెల్లడించారు.

ఇదీచూడండి: లాక్​డౌన్​ ఫేస్​-2కు చైనా రెడీ.. కోటిన్నర మందికి ఒకేసారి కరోనా టెస్టు​లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.