ETV Bharat / city

భాగ్యనగరంలో కరోనా విలయతాండవం.. ఊరిబాట పడుతోన్న జనం - covid patients are going hometown from Hyderabad

కరోనా వైరస్‌ భాగ్యనగరవాసుల్ని వణికిస్తోంది. రోజు రోజుకు కేసులు పెరుగుతుండటంతో చాలా మంది తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు. చేసుకునేందుకు పని అందుబాటులో ఉన్నా వైరస్‌ ప్రభావం తగ్గిన తర్వాతే వస్తామని అంటున్నారు. ఇప్పటికే వలస కూలీలు సొంతూళ్ల బాట పట్టారు. మరోవైపు ఇళ్లలో సాధారణ మరమ్మతులు వంటి పనులు చేసేవారు, పలువురు ప్రైవేటు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోం ఇవ్వడం, కోచింగ్‌ సెంటర్లు మూసివేతతో చాలా మంది ఇళ్లకు వెళ్లిపోతున్నారు. కొందరు పాజిటివ్‌ వచ్చిన కరోనా రోగులు సైతం ఇంటి బాట పడుతున్నారు. హోం ఐసోలేషన్‌లో ఇబ్బందులు, సహాయం అందించేవారు కరవవ్వడంతో సొంతూళ్లకు పయనమవుతూ..వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్నారు.

covid-patients-are-going-hometown-from-hyderabad
భాగ్యనగరంలో కరోనా విలయతాండవం.. ఊరిబాట పడుతోన్న జనం
author img

By

Published : Apr 27, 2021, 8:32 AM IST

చదువుకోవడానికో.. ఉద్యోగం కోసమే.. ఉపాధి కోసమో భాగ్యనగరానికి వచ్చిన వారు నగరంలో రోజురోజుకు విజృంభిస్తున్న మహమ్మారికి భయపడుతున్నారు. ఇక్కడే ఉంటే ప్రాణాలు ఉంటాయో లేదోనని సొంతూళ్లకు పయనమవుతున్నారు. కరోనా పాజిటివ్ నిర్ధరణ అయిన కొందరు కూడా ఊళ్లకు వెళ్తున్నారు.

రోగం వస్తే చూసే దిక్కులేదు..తిన్నావా..పడుకున్నావా అని అడిగే వారు లేరు..! ఆప్యాయత పంచే మనుషులు లేరు. మందులు, సరకులు తేవడానికి, వ్యాధి తీవ్ర స్థాయిలో ఉంటే ఆసుపత్రికి తీసుకెళ్లేవారు లేక చాలా మంది కరోనా బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. హోం ఐసొలేషన్‌ సదుపాయాలు లేక కొందరు సొంతూళ్లకు పయనమవున్నారు.

ఎల్బీనగర్‌లో ఉండే ఓ ప్రైవేటు ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ రాగా.. ఆ రోజే తన తండ్రికి సైతం నిర్ధారణ పరీక్షలు చేయించారు. ఆయనకి సైతం పాజిటివ్‌ రాగా ఏం చేయాలో పాలుపోలేదు. ఇంట్లో వారిద్దరే ఉండటంతో హోం ఐసోలేషన్‌లో వారికి సహాయం చేసేవారు లేరు. పక్కవారిని సాయం అడుగుదామన్నా...ఎలా స్పందిస్తారోనన్న ఆందోళన. ఇంటి యజమానికి తెలిస్తే ఇల్లు ఖాళీ చేయిస్తాడనే భయం...నిస్సహాయ స్థితిలో తండ్రితో పాటు ఊరెళ్లిపోయాడు. ఈ క్రమంలో వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్నాననే ఆలోచనే మర్చిపోయాడు.

గ్రేటర్‌లో 1418 కేసులు నమోదు

గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,418 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 482 మంది, మేడ్చల్‌లో 554 మందికి కరోనా నిర్ధారించారు. గాంధీ, టిమ్స్‌ల్లో మృతులు భారీగా ఉంటున్నారు. కొవిడ్‌తో చికిత్స పొందుతున్న వారిలో 43 మంది మృతిచెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారిక లెక్కలు పేర్కొన్నాయి. కొవిడ్‌ ఇతర అనుబంధ వ్యాధులతో మరో 20-30 మంది చనిపోయినట్లు సమాచారం.

వర్కర్లు ఇంటికే..

ప్లంబింగ్‌ వర్క్‌, మార్బుల్స్‌, ఎలక్ట్రీషియన్‌, ఏసీ మరమ్మతులు తదితర పనులు చేసేందుకు ఏజెంట్లను సంప్రదించినా పనివాళ్లు లేరంటూ సమాధానం చెబుతున్నారు. సాధారణంగా ఈ పనుల్ని ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బెంగాల్‌, బీహార్‌ రాష్ట్రాలకు చెందిన కార్మికులు చేస్తుంటారు. అయితే కరోనా రెండో వేవ్‌ మొదలవ్వగానే వీరంతా సొంత ఊళ్లకు బయలుదేరారు. దీంతో సాధారణ పనులు చేయించేందుకు పనిచేసేవారు కరవయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.