కూకట్ పల్లి ఐడీఎల్ చెరువు వద్ద బతుకమ్మ, వినాయక నిమజ్జనం కోసం తవ్విన కొలను కాలుష్యంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్నిహైకోర్టు ఆదేశించింది. కొలనులో ఇష్టారాజ్యంగా వ్యర్థాలు నింపుతుండటం వల్ల.. కాలుష్యమయమై.. దుర్గంధ భరితంగా మారిందని పేర్కొంటూ ఈనెల 3న ఈనాడులో ప్రచురితమైన ఫోటోను ధర్మాసనం ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా విచారణకు స్వీకరించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్, కూకట్ పల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్, మేడ్చల్ జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
కొలను కాలుష్యంపై కౌంటర్ దాఖలుకు హైకోర్టు ఆదేశం - Hicourt updates
12:50 December 16
కొలను కాలుష్యంపై కౌంటర్ దాఖలుకు హైకోర్టు ఆదేశం