రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వస్తున్న పత్తి నాణ్యంగా లేదనే కారణంతో సోమవారం నుంచి మద్దతు ధర రూ.50 తగ్గిస్తున్నట్లు భారత పత్తి సంస్థ(సీసీఐ) తెలిపింది. ఈ మేరకు తెలంగాణ మార్కెటింగ్‌శాఖకు లేఖ రాసింది.
ఇప్పటివరకు తేమ 8-12 శాతం లోపు ఉండి పింజ పొడవు 30 మి.మీ.పైన ఉండే పత్తికి క్వింటాలుకు ప్రభుత్వం ప్రకటించిన రూ.5,825 మద్దతు ధరను సీసీఐ చెల్లిస్తోంది. వర్షాల కారణంగా పింజ పొడవు 30 మి.మీ. రావడం లేదని, ఈ నేపథ్యంలో బీబీ స్పెషల్ గ్రేడ్ పేరిట క్వింటాలుకు రూ.5,775 ధర చెల్లించనున్నట్లు తెలిపింది.