కరోనా మహమ్మారిపై అవగాహన కల్పించేలా తిరుపతిలో వినూత్న రీతిలో ప్రదర్శన నిర్వహించారు. నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద భాజపా నేత గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో రాయలసీమ రంగస్థల నాటక మండలి కళాకారులు యమధర్మరాజు, భటుల వేషధారణలో... బాధ్యతారాహిత్యంగా రహదారులపై వచ్చే వారిని ఆపి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు. లాక్ డౌన్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలంతా సహకరించి... స్వచ్ఛందంగా ఇళ్లలోనే ఉండాలని కోరారు.
ఇదీ చూడండి: అతడి క్లారిటీ చూసి పోలీసులే షాక్ అయ్యారు