ETV Bharat / city

కరోనా బాధితుల మృతదేహాలు చెత్త ట్రాక్టర్​లో తరలింపు - kavali latest corona news

కొవిడ్ మృతులకు గౌరవప్రదంగా అంత్యక్రియలు జరపాలని ఏపీ ప్రభుత్వం చెబుతున్నా కొన్ని చోట్ల అలా జరగటం లేదు. నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన ఓ ఘటన దీనికి నిదర్శనంగా మారింది. కావలి ఏరియా ఆస్పత్రి నుంచి కరోనా బాధితుల మృతదేహాలను మున్సిపల్ సిబ్బంది చెత్త ట్రాక్టర్​లో తరలించారు.

కరోనా బాధితుల మృతదేహాలను చెత్త ట్రాక్టర్​లో తరలింపు

author img

By

Published : Aug 12, 2020, 10:57 AM IST

Updated : Aug 12, 2020, 11:03 AM IST

కరోనా బాధితుల మృతదేహాలను చెత్త ట్రాక్టర్​లో తరలింపు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. కావలి ఏరియా ఆస్పత్రి నుంచి కరోనా మృతదేహాలను చెత్త తరలింపుకు వినియోగించే ట్రాక్టర్​లో మున్సిపల్ సిబ్బంది తరలించారు. ప్రభుత్వ ఆదేశాలను ఏ మాత్రం పట్టించుకోకుండా దారుణంగా ప్రవర్తించారు.

కావలి ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు వ్యక్తులు కరోనాతో మరణించారు. వారి మృతదేహాలను ఖననం చేసేందుకు మున్సిపల్ సిబ్బంది మున్సిపాలిటీ చెత్త ట్రాక్టర్​లో తరలించారు. మున్సిపల్, ఆసుపత్రి సిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. కరోనా మృతదేహాలను అంబులెన్స్​లో తరలించాలని నిబంధన ఉంది. కానీ ఈ నిబంధనను నెల్లూరు జిల్లాలో కొన్ని చోట్ల అధికారులు పాటించడం లేదు. గతంలో కూడా కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను పెన్నానదిలో జేసీబీతో పూడ్చిపెట్టిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి

లక్ష్యానికి ఆమడ దూరంలో ప్రజా మరుగుదొడ్ల ఏర్పాటు

Last Updated : Aug 12, 2020, 11:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.