రాష్ట్రంలో లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ప్రజలు గుంపులుగుంపులుగా తిరుగుతున్నారు. ముఖ్యంగా మార్కెట్లలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటోంది. ఆదివారం కావడం వల్ల హైదరాబాద్‌లోని ముషీరాబాద్ చేపల మార్కెట్‌కు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు.
కొద్దిరోజులుగా మార్కెట్ వద్ద కరోనా నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. ఇలాంటి ప్రాంతాల్లోనే వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుందని తెలిపారు. అధికారులు చొరవ చూపి ప్రజలు గుమిగూడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
మార్కెట్లో కరోనా నిబంధనల ఉల్లంఘన జరుగుతుందని.. పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో.. ముషీరాబాద్ చేపల మార్కెట్‌పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఉదయం 5 గంటల నుంచి మార్కెట్‌కు వచ్చే వాహనాలను బయటే నిలిపివేశారు. భౌతిక దూరం పాటించని కొనుగోలుదారులను, నిబంధనలు ఉల్లంఘించిన విక్రయదారులను హెచ్చరించిన పోలీసులు జరిమానా విధించారు.