ETV Bharat / city

రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్.. అప్రమత్తమైన ప్రభుత్వం - corona virus news

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు.. మరో ఇద్దరికి లక్షణాలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మహమ్మారి వ్యాప్తి కట్టడికి ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ నెల 31 వరకు విద్యాసంస్థలు, థియేటర్లు మూసివేయాలని నిర్ణయించింది. బడ్జెట్ సమావేశాలను కుదించారు. సాయంత్రం నిర్వహించే కేబినెట్ భేటీలో వివిధ ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకుంటారు.

corona
corona
author img

By

Published : Mar 14, 2020, 5:48 PM IST

దేశంలో రెండు కరోనా మరణాలు, రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన భేటీ అయిన ఉన్నతస్థాయి కమిటీ... దేశంలో కరోనా ప్రభావం, పలు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై చర్చించింది. రాష్ట్రంలో ఈ వైరస్‌ ప్రభావాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వివిధ ప్రతిపాదనలపై మంత్రివర్గభేటీలో చర్చించి... నిర్ణయం తీసుకుంటారు.

విద్యాసంస్థలు బంద్​

ఈ మహమ్మారి వ్యాప్తి కట్టడికి ముందస్తు చర్యలు చేపట్టింది. జనసందోహాలకు ప్రజలు దూరంగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యా సంస్థలను ఈ నెల 31 వరకు మూసివేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటికే వివిధ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని మాత్రం యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

బడ్జెట్ సమావేశాలు కుదింపు

రాష్ట్రంలోని సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌ను మూసివేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. శాసనసభ బడ్జెట్‌ సమావేశాలనూ కుదించాలని నిర్ణయం తీసుకున్నారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 20 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సోమవారంతో ముగించాలని నిర్ణయించారు. ఆది, సోమవారాల్లో సభ నిర్వహించి.. ఆఖరిరోజు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి ఆమోదం తెలిపిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేయనున్నారు.

సభలోనూ చర్చ

శాసనసభలోనూ కరోనాపై చర్చ జరిగింది. కొవిడ్ 19పై ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. గాంధీలో చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. మరో ఇద్దరికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయని... వారి నమూనాలు పుణె పరీక్ష కేంద్రానికి పంపించామని వివరించారు. కొన్ని రోజులపాటు రాష్ట్రంలో బహిరంగ సమావేశాలు వద్దని కోరారు. విందులు, వేడుకలు ఇంటికే పరిమితం చేసుకోవాలని సూచించారు. ‌రెండు చోట్ల ఐసోలేషన్​ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

ఇదీ చూడండి: ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్ వచ్చింది: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.