ETV Bharat / city

బెజవాడ ఆస్పత్రిలో కన్నీటి దృశ్యాలు.. ఆప్తుల ఆర్తనాదాలు

ఏపీలోని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో రోజుకో దృశ్యం హృదయవిదారకంగా మారుతోంది. కొవిడ్‌ బారినపడి చికిత్స పొందేందుకు గంటల తరబడి నిరీక్షిస్తోన్న వారి వేదనలు అన్నీ ఇన్నీకావు. బాధితుల ఆవేదన చూడలేక సహాయకులు, వారి బంధువుల కళ్లలో నీరు సుడులు తిరుగుతున్న ఉదంతాలకు లెక్కేలేదు. ఆసుపత్రిలో తాజాగా కనిపించిన ఓ రెండు ఉదంతాలు అందరీ హృదయాలను కదిలించాయి.

Vijayawada hospital
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో రోజుకో విషాదకర దృశ్యాలు
author img

By

Published : Apr 27, 2021, 7:33 AM IST

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో రోజుకో విషాదకర దృశ్యాలు

ఏపీలోని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో రోజుకో దృశ్యం హృదయవిదాకరకంగా మారుతోంది. కొవిడ్‌ బారినపడి చికిత్స పొందేందుకు గంటల తరబడి నిరీక్షిస్తోన్న వారి వేదనలు అన్నీ ఇన్నీ కావు. బాధితుల ఆవేదన చూడలేక సహాయకులు, వారి బంధువుల కళ్లలో నీరు సుడులు తిరుగుతున్న ఉదంతాలకు లెక్కలేదు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని ఆటో ట్రాలీలో కనిపిస్తోన్న వ్యక్తి పేరు జగదీష్‌. పాయకాపురం నివాసి. కరోనా లక్షణాలతో నాలుగు రోజుల క్రితం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రిలో పడకల కొరత కారణంగా వైద్యులు మందులు అందజేసి హోం ఐసొలేషన్‌లో ఉండాలని సూచించారు.

సోమవారం ఉదయం ప్రాణవాయువు అందడం ఇబ్బందికరంగా ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు జగదీష్‌ కుటుంబ సభ్యులు అంబులెన్స్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. సుమారు గంటపాటు అంబులెన్స్‌ కోసం చేయని ఫోన్లు లేవు. ఎక్కడా స్పందన లేకపోవడంతో ఆటో ట్రాలీలో పడుకోబెట్టి అతన్ని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్వాస అందేలా చేసేందుకు అతని భార్య తన రెండు చేతులతో గుండెపై గట్టిగా అదిమి తనవంతు ప్రయత్నించారు. ఆసుపత్రికి చేరేసరికే ఊపిరి ఆగిపోయింది.

ఆటో నుంచి జగదీష్‌ను ఆసుపత్రి లోపలికి తీసుకెళ్లలేదు. వైద్య సిబ్బంది ఆటోవద్దకు వచ్చి అతనికి పరీక్షలు చేశారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు. జగదీష్‌ ఆటోడ్రైవరు. ఆటో నడుపుతూ బతుకు ప్రయాణం సాగిస్తున్నారు. తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అదే ఆటోలోనే తన జీవన ప్రయాణం ఆగిపోవడం అందరినీ కలచివేస్తోంది. సకాలంలో అంబులెన్స్‌ దొరికి.. ప్రాణవాయువు అంది ఉంటే తన భర్త బతికి ఉండే వారేమోనని అతని భార్య కన్నీరుమున్నీరుగా విలపించారు.

కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన ఓ వ్యక్తి మూడు రోజుల క్రితం కరోనాతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. సోమవారం ఉదయం చనిపోవడంతో తన పిల్లలకు తండ్రి చివరి చూపు చూపించేందుకు అతని తల్లి పీపీఐ కిట్లు తొడిగించి మరీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆక్సిజన్‌ స్థాయి లెవెల్‌ తగ్గిపోయినా తన భర్తను ఐసీయూలో ఖాళీ లేదని సాధారణ వార్డులోనే ఉంచారని.. ఆక్సిజన్‌ స్థాయి తగ్గిందని.. తాము వైద్యులకు తెలియజేసినా ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో ఖాళీ లేకపోవడంతో తగిన రీతిలో స్పందించలేదని ఆమె ఆవేదన చెందారు. చివరి నిమిషంలో సోమవారం ఉదయం ఐసీయూలోకి తీసుకెళ్లినా తన భర్త ప్రాణం నిలవలేదని బోరుమన్నారు. తన పిల్లలకు తండ్రి కడచూపు చూపించేందుకు పీపీఐ కిట్లతో రాక తప్పలేదని ఆమె కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఆసుపత్రి ఆవరణలో వైద్యం కోసం పెద్ద సంఖ్యలో బాధితులు నిరీక్షిస్తోన్న వేళ.. ఈ తరహా ఘటనలు మరింత ఆందోళనను రేకెత్తిస్తున్నాయి.

ఇవీ చదవండి: మాజీ మంత్రి ఎమ్మెస్సార్‌ కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.