తెలంగాణలో కరోనా మహమ్మారి ఉద్దృతి కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో తాజాగా మరో 4801 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈరోజు వరకు 75,289 మందికి పరీక్షలు చేయగా... 4826 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. మహమ్మారి బారిన పడి మరో 32 మంది మరణించారు. 7403 మంది కోలుకున్నారు.
ప్రస్తుతం 60,136 యాక్టివ్ కేసులున్నట్లు అధికారులు వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 756 కరోనా కేసులు నమోదు కాగా... మేడ్చల్ జిల్లాలో 327, రంగారెడ్డి జిల్లాలో 325 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది.
ఇదీ చూడండి:
- లాక్డౌన్ ఎఫెక్ట్: వైన్సుల ముందు బారులు తీరిన మందుబాబులు