ETV Bharat / city

జర్నలిస్టుల కోసం హెల్ప్​లైన్​... రేపటి నుంచే అందుబాటులోకి..

author img

By

Published : Apr 30, 2021, 4:05 PM IST

Updated : Apr 30, 2021, 6:53 PM IST

కరోనా విజృంభిస్తున్న వేళ మహమ్మారి బారిన పడుతున్న జర్నలిస్టులకు సత్వర సాయం అందించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక హెల్ప్​డెస్క్​ ఏర్పాటు చేయనుంది. దీని కోసం ప్రత్యేక వాట్సాప్​ నంబర్​ను అధికారులు ప్రకటించారు. సేవలు రేపటి నుంచే అందుబాటులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు.

corona help desk for journalists in telangana

రాష్ట్రంలో జర్నలిస్టులకు కొవిడ్‌ వైద్యసేవలు సత్వరం అందించే దిశగా వైద్య ఆరోగ్యశాఖ హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడాన్ని హైదరాబాద్‌ ప్రెస్​ క్లబ్‌ స్వాగతించింది. వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ప్రెస్‌క్లబ్‌ హైదరాబాద్‌ బృందం... సమావేశమై రాష్ట్రంలో కొవిడ్‌ ఉద్ధృతి, అనేక మంది జర్నలిస్టుల మరణాలు, వైద్యం కోసం జర్నలిస్టులు పడుతున్న ఇబ్బందులను వివరించారు.

ప్రెస్‌క్లబ్‌ బృందం విజ్ఞప్తి మేరకు శనివారం నుంచి ప్రత్యేక వాట్సాప్‌ నంబర్‌ను జర్నలిస్టుల కోసం వైద్యశాఖ ఉన్నతాధికారులు అందుబాటులో ఉంచారు. లక్షణాలున్న జర్నలిస్టులు తమ వివరాలను అందులో అప్‌లోడ్‌ చేస్తే... పరీక్షలు, మందుల కిట్లు, అవసరమైన వారికి బెడ్ల కేటాయింపు చేసేందుకు ప్రత్యేక టీంను అందుబాటులోకి తెస్తామని డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ ఉన్నతాధికారులు తెలిపారు. జర్నలిస్టుల కోసం ప్రెస్‌క్లబ్‌ హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక వాక్సినేషన్‌ కేంద్రాలు త్వరలోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

జర్నలిస్టుల కోసం వైద్యారోగ్య శాఖ ఏర్పాటు చేసిన హెల్ప్​లైన్ నంబర్​: 8639710241

ఇదీ చూడండి: కరోనాపై భయాలొద్దు.. ఇవి తెలుసుకోండి

Last Updated : Apr 30, 2021, 6:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.