కరోనా వేళ రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. శుభ కార్యాలు, భగవంతుని పూజల్లో కళకళ లాడాల్సిన పూలు రహదారి పక్కన చేరి వెలవెలబోతున్నాయి. అమ్మే వారు ఉన్నా కొనే వారు లేక రైతులు తాము తెచ్చిన పూలను పారబోసుకుంటున్నారు. గిరాకీలు లేక నష్టాలను మూటగట్టుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా వి.కోటకు చెందిన రైతు వెంకన్న రూ.19వేలు రవాణా ఖర్చు భరించి 4టన్నుల పూలను బుధవారం.. తూర్పుగోదావరి జిల్లా కడియపులంక పూల మార్కెట్‌కు తీసుకొచ్చారు. శుభకార్యాలు లేక పూలకు డిమాండ్ లేదని వ్యాపారులు చెప్పడంతో.. ఉసూరుమంటూ వాటిని రహదారి పక్కన పారబోశారు.
ఇదీ చదవండి: రామగుండం ఫెర్టిలైజర్స్‌కూ న్యూ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ వర్తింపు