ETV Bharat / city

CORONA: రెండో దశ కరోనా తగ్గుముఖం.. వ్యాక్సినేషనే కారణం

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొన్ని ప్రాంతాల్లో సున్నా కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ వేయించుకునేందుకు ప్రజలు ముందుకురావడమే కేసులు తగ్గడానికి ఓ కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండో దశ ప్రభావం తగ్గినా.. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటి అలవాట్లు పాటిస్తూనే ఉండాలని సూచిస్తున్నారు. వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తయితే ముడో దశ ఎక్కువ ప్రభావం చూపదని చెబుతున్నారు.

Corona cases, corona spread in Telangana, reduced corona cases in Telangana
కరోనా కేసులు, తెలంగాణలో కరోనా వ్యాప్తి, తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు
author img

By

Published : Jul 3, 2021, 10:32 AM IST

కరోనా సెకండ్‌ వేవ్‌ దాదాపు తగ్గుముఖం పట్టింది. కొన్ని ప్రాంతాల్లో సున్నా కేసులు నమోదవుతున్నాయి. భాగ్యనగరంలో గురువారం నిర్వహించిన ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షల ఫలితాలే ఇందుకు నిదర్శనం. పట్టణ ఆరోగ్య కేంద్రాలతోపాటు ఆయుర్వేద, నేచర్‌క్యూర్‌, యునానీ ఆసుపత్రులతోపాటు జిల్లా దవాఖానాల్లో 7,462 ర్యాపిడ్‌ టెస్టులు చేయగా 42 మందికి మాత్రమే పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పాజిటివ్‌ శాతం 0.56గా నమోదైంది. రెండు నెలల క్రితం కొన్ని కేంద్రాల్లో 20-30 శాతం వరకు పాజిటివ్‌ రేటు నమోదవడం గమనార్హం.

ఇదిలా ఉంటే చాలామంది వ్యాక్సిన్‌ వేయించుకొనేందుకు ముందుకొస్తున్నారు. కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు రెండు డోసులు వేయించుకోవడం వల్ల యాంటీబాడీలూ పెరుగుతున్నాయి. కేసులు తగ్గుముఖం పట్టడానికి ఇదీ ఓ కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. వైరస్‌లో వచ్చే ఉత్పరివర్తనాల కారణంగా... అది ముదిరితే మళ్లీ కేసులు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది మూడో దశకు దారి తీసే ప్రమాదం ఉందన్నారు. కరోనా లేదని నిరూపితం అయ్యే వరకు వరకు జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేస్తున్నారు. మాస్క్‌ ధరించడం, ఎడం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం చేస్తూనే.. అందరూ వ్యాక్సిన్‌ వేయించుకొంటే మూడో దశ ప్రభావం చూపదని చెబుతున్నారు.

సున్నా కేసులు ఎక్కడంటే

జంగమ్మెట్‌ యూపీహెచ్‌సీలోని చందూలాల్‌ బారాదరి, తీగలకుంట, జహనుమా, చార్మినార్‌, ఉమ్డాబజార్‌, అలియాబాద్‌ క్లస్టర్ల పరిధిలో గురువారం 282 మందికి పరీక్షలు చేయగా ఒక్కరూ పాజిటివ్‌గా నిర్ధారణ కాలేదు.

డబీర్‌పురా అర్బన్‌ హెల్త్‌ కేంద్రం పరిధిలోని దారుల్‌షిఫా, ఆజంపురా, యూకుత్‌పురా-1, 2 క్లస్టర్లలో 423 పరీక్షలకు, అంబర్‌పేట పరిధిలోని బాగ్‌అంబర్‌పేట్‌, ముషీరాబాద్‌, బోలక్‌పూర్‌, హర్రాజుపెంట, తిలక్‌నగర్‌ల్లో 406 పరీక్షలకు గాను 0 కేసులు నమోదయ్యాయి.

పరీక్షలు, ఫలితాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.