కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నగర పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కొవిడ్-19 వైరస్ రూపంలో తయారుచేసిన శిరస్త్రాణాలను ధరించి... అశ్వదళం, ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషిచేయనున్నారు.
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద పంజాగుట్ట ఏసీపీ గోవర్థన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరోనాను కట్టడి చేయాలంటే.. ప్రభుత్వ, పోలీసు చర్యలతో పాటు ప్రజల సాకారం చాలా అవసరమన్నారు.
నగరంలోని ప్రస్తుత పరిస్థితి, లాక్డౌన్ ఉల్లంఘనలపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు.. వంటి విషయాలపై పంజాగుట్ట ఏసీపీ గోవర్థన్తో ఈటీవీ భారత్ ముఖాముఖి..
ఇవీచూడండి: 26 ఏళ్లు క్వారంటైన్‌లోనే ఉన్న వంట మనిషి కథ ఇది...