సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కరోనా వైరస్‌పై విద్యార్థులకు వైద్యుడు రాజ్ కుమార్ అవగాహన కల్పించారు. వైరస్‌పై భయపడాల్సిన పని లేదని ఆయన అన్నారు. చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలని పటాన్ చెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన అవగాహన శిబిరంలో పేర్కొన్నారు.
రోగనిరోధకత పెంచుకుంటే చాలు
కరచాలనానికి బదులు వందనం చేయాలని తెలిపారు. కొద్ది రోజులుగా జలుబు, జ్వరం, శ్వాస పీల్చుకో లేని స్థితి లాంటివి కలిగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. కొవిడ్-19 వైరస్ సోకినా భయపడాల్సిన అవసరం లేదని... రోగనిరోధక శక్తి ఉన్న వారికి తొందరగానే తగ్గిపోతుందని స్పష్టం చేశారు. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి నయమవడానికి కాస్త ఆలస్యమవుతుందని పేర్కొన్నారు. ఈ వైరస్‌పై విద్యార్థులు... ఇతరులకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు.