ETV Bharat / city

వారు కఠినత్వంలోనే కాదు...ఔదార్యంలోనూ భేష్ - కవలల ప్రాణాలు కాపాడిన పాలీసులు

కరోనాను కట్టడి చేసేందుకు కఠినంగా వ్యవహరిస్తూ వైద్యులతో పాటు పోలీసులు నిర్విరామంగా శ్రమిస్తున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలోనూ అంతే ఔదార్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏడు నెలలకే జన్మించిన కవల పిల్లలకు కడప రిమ్స్ ఆసుపత్రిలో సరైన సదుపాయాలు లేనందున ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడారు.

ఆపదలో ప్రాణాలు నిలిపిన పోలీసులు
ఆపదలో ప్రాణాలు నిలిపిన పోలీసులు
author img

By

Published : Apr 9, 2020, 10:17 AM IST

లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలు చేసేందుకు కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులు... ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలోనూ అంతే ఔదార్యాన్ని చూపిస్తున్నారు. కడప రిమ్స్‌లో ఏడు నెలలకే పుట్టిన కవల శిశువులను... మౌలిక సదుపాయాలున్న ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాణాలు నిలిచేందుకు కృషి చేశారు. కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం అబ్బాపురానికి చెందిన రమాదేవి టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా గర్భం దాల్చింది. రిమ్స్‌లో ఏడో నెలలోనే ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. రిమ్స్‌లో సరైన పరికరాలు లేవని, ఇక్కడే ఉంచితే శిశువులు బతకటం కష్టమని వైద్యలు స్పష్టం చేశారు.

కదిలిన ఎస్పీ ...

తల్లడిల్లిన తల్లిదండ్రులు... వెంటనే ఎస్పీ అన్బురాజ్‌కు ఫోన్‌ చేశారు. నగరంలో ఆసుపత్రులన్నీ మూసి ఉన్నాయని, ఏదైనా చేసి తమ పిల్లలను బతికించాలని కోరారు. స్పందించిన ఎస్పీ వెంటనే డీఎస్పీ సూర్యనారాయణకు ఫోన్‌ ద్వారా విషయం తెలియజేశారు. మూసిఉన్న ప్రైవేట్ ఆసుపత్రిని తెరిపించి, సిబ్బందికి సైతం సమాచారమిచ్చి... తల్లీబిడ్డలను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారులు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.

ఆపదలో ప్రాణాలు నిలిపిన పోలీసులు

ఇవీ చూడండి : రాష్ట్రంలో 453కు పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.