ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్​.. తగ్గిన కూలర్లు, ఏసీల వాడకం - coronavirus updates

కరోనా ప్రభావంతో ప్రజలు ఏసీలు, కూలర్లు వాడడమే మానేశారు. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులే ధ్రువీకరిస్తున్నారు. ఏటా మార్చి రెండో వారంలో మూలకున్న కూలర్లను బయటకు తీసి మరమ్మతులు చేసి వాడడం మొదలుపెడతారు. ఏప్రిల్ వచ్చినప్పటికీ కూలర్ల వాడకం మొదలు కాలేదు. ఏసీల వాడకం కూడా బాగా తగ్గించారు. విద్యుత్ డిమాండ్ బాగా తగ్గిపోయింది.

coolers
coolers
author img

By

Published : Apr 1, 2020, 12:19 PM IST

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఇంట్లో ఏసీ, కూలర్ వాడతామంటే.. ఎక్కడ జలుబు, జ్వరం వస్తుందో అని హడలిపోతున్నారు. ఏసీలను అతి తక్కువ మోతాదులో వినియోగిస్తున్నారు. ఇదంతా కరోనా ఎఫెక్టే అని విద్యుత్ శాఖ అధికారులు భావిస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో సాఫ్ట్​వేర్ సంస్థలు, వివిధ కర్మాగారాలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు మూతపడ్డాయి. అందరూ దాదాపు ఇంట్లోనే ఉంటున్నారు. ఈనేపథ్యంలో ఏసీలు, ఫ్రిజ్​లు, కూలర్లు, ఫ్యాన్లు ఎక్కువగా వాడతారని అధికారులు భావించారు. వారి అంచనాలు తల్లకిందులయ్యాయి. ఎవ్వరూ ఫ్రిజ్​​లు, కూలర్లు పెద్దగా వాడడం లేదని.. ఏసీల వాడకం బాగా తగ్గిపోయిందని విద్యుత్​ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

కరోనా భయం వల్లే తగ్గిన వాడకం

ఇదే విషయాన్ని ప్రజలు అంగీకరిస్తున్నారు. చిన్న పిల్లలకు ఎక్కడ జలుబు, జ్వరం వస్తుందో అని ఏసీ, కూలర్లను అసలు వాడడంలేదని అంటున్నారు. వాస్తవానికి ఈ సీజన్​లో కూలర్లు, ఏసీల కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. మార్కెట్లోకి కొత్త కొత్త మోడళ్ల ఏసీలు, కూలర్లు వస్తుంటాయి. కానీ.. ఈసారి లాక్ డౌన్ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ షాప్​లూ మూతబడ్డాయి. కొనుగోళ్లు అటుంచి... ఇంట్లో ఉన్న వాటిని కూడా ప్రజలు వాడడంలేదు.

ఇలా తగ్గింది

ఏటా వేసవికాలంలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఆ వాడకం బాగా తగ్గిపోయింది. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 31న 8,334 మెగావాట్ల విద్యుత్ వాడకం ఉంటే.. ఈ ఏడాది అదే రోజున 6,610 మెగావాట్లకు పడిపోయింది. ఈ ఏడాది వినియోగం 1,724 మెగావాట్లకు తగ్గిపోయింది. గతేడాది మార్చి 31న గ్రేటర్ పరిధిలో 2,500ల మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగితే... ఈ ఏడాది అదే రోజు 1,778 మెగావాట్లకు పడిపోయింది. 722 మెగావాట్ల విద్యుత్ వినియోగం తగ్గిపోయిందని విద్యుత్ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇందులో సగం అంటే సుమారు 300 మెగావాట్ల వరకు ఏసీలు, కూలర్ల వాడకం తగ్గడం వల్లే విద్యుత్ వినియోగం తగ్గి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

గ్రేటర్ పరిధిలో రోజుకి 10 మిలియన్ యూనిట్ల విద్యుత్ కేవలం ఏసీలు, కూలర్లకే వినియోగిస్తుంటారని అధికారులు పేర్కొంటున్నారు. ఏప్రిల్ మాసం రెండో వారానికి వ్యవసాయశాఖ పనులు కూడా పూర్తవుతాయని.. అవి పూర్తయితే రాష్ట్ర వ్యాప్తంగా మరో ఏడెనిమిది వందల మెగావాట్ల విద్యుత్ వినియోగం తగ్గిపోయే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

కరోనా ఎఫెక్ట్​.. తగ్గిన కూలర్లు, ఏసీల వాడకం

ఇదీ చూడండి: కరోనాపై పోరాటానికి రామోజీ సంస్థల భారీ విరాళం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.