ETV Bharat / city

నల్లా కావాలా.. జేబు నింపాల! - hyderabad latest news

కొత్త నల్లాల జారీ సమయంలో నీటి మీటర్లపై కొంతమంది గుత్తేదారులు, సిబ్బంది అదనంగా బాదేస్తున్నారు. ఒక్కో మీటరుపై కనీసం రూ.800 పైనే పిండుకుంటున్నారు. నిబంధనల ప్రకారం నల్లాల కనెక్షన్లు ఇవ్వడమే గుత్తేదారుల విధి. నీటి మీటర్లు విక్రయించే అధికారం లేకపోయినా, కొంతకాలంగా ఈ దందా కొనసాగిస్తున్నారు.

new water connections
నల్లా కావాలా.. జేబు నింపాల!
author img

By

Published : Sep 25, 2020, 8:02 AM IST

గ్రేటర్‌ వ్యాప్తంగా కొత్త నల్లాలు తీసుకునే వారి జేబుకు భారీగా చిల్లు పడుతోంది. ప్రతినెలా కనీసం 3-4 వేల వరకు కొత్త నల్లాలు జారీ చేస్తుంటారు. తొలుత దరఖాస్తుతోపాటు కనెక్షన్‌ ఛార్జీలను జలమండలికి చెల్లించాలి. 18 రోజుల తర్వాత నల్లా జారీ చేస్తారు. ఈ సమాచారాన్ని ఏరియా గుత్తేదారులకు జలమండలి పంపుతుంది. నల్లా ఇచ్చేటప్పుడే తప్పనిసరిగా నీటి మీటరు బిగించాలి. లేదంటే వినియోగదారుడికి అంకె(క్యాన్‌ నంబరు) కేటాయించడం సాధ్యపడదు. వాస్తవానికి నీటి మీటర్లను వినియోగదారులే కొనుక్కోవాలి.

గతంలో నాణ్యత ఉన్న పది కంపెనీలను జలమండలి ఎంపిక చేసి వాటిలో నచ్చిన కంపెనీది కొనుక్కోవచ్చని తెలిపింది. ఐఎస్‌ఐ మార్కు ఉన్న ఇతర కంపెనీల మీటర్లయినా అమర్చుకునే వెసులుబాటు కల్పించింది. కొవిడ్‌ వల్ల చాలామంది మార్కెట్‌కి వెళ్లి మీటర్లు కొనుగోలు చేసేందుకు జంకుతున్నారు. దీంతో కొందరు గుత్తేదారులు, సిబ్బంది తామే మీటర్లు సరఫరా చేస్తామని అదనంగా గుంజుతున్నారు. వినియోగదారులు ఇతర కంపెనీల మీటర్లు కొన్నా.. అవి నాణ్యతతో ఉండవని...తప్పుడు లెక్కలు చూపిస్తాయని చెప్పి తమ వద్దే కొనేలా చేస్తున్నారు. అడిగినంత ముట్టజెప్పాల్సి వస్తోంది.

  • 15 ఎంఎం నీటి మీటరు మార్కెట్‌ ధర - రూ.1200
  • గుత్తే దారులు వసూలు చేస్తోంది - రూ.2వేలకు పైనే
  • గ్రేటర్‌లో ప్రతి నెల జారీ చేసే నల్లాలు - రూ.3-4వేలు
  • ఒక్కో నల్లాకు వినియోగదారుడిపై పడే భారం - రూ.2000

అదనపు పైపుల పేరుతో...

అదనపు పైపుల పేరుతోనూ కొందరు గుత్తేదారులు దండుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రధాన పైపులైన్‌ నుంచి ఇంటిలోని సంపు వరకు నల్లా కనెక్షన్‌ ఇవ్వాలంటే 15 ఎంఎం పరిమాణంలో అదనపు పైపు అవసరమవుతుంది. దీన్ని జలమండలే సరఫరా చేస్తుంది. జలమండలి నుంచి ప్రతి కొత్త కనెక్షన్‌కు 34 మీటర్ల అదనపు పైపు ఇస్తారు. క్షేత్రస్థాయిలో తమకు పది మీటర్లే ఇస్తున్నారని, అదనపు పైపులను కొనుగోలు చేయాలని కొందరు గుత్తేదారులు చెబుతున్నారు. ఆ అదనపు పైపును వారే ఇస్తుండడం గమనార్హం. ఇలా ప్రతి మీటర్‌కు రూ.30-40 వరకు వసూలు చేస్తున్నారు. లేబర్‌ ఛార్జీల పేరుతో రూ.300-400 పిండుకుంటున్నారు. ఇలా కొత్త నల్లా అడిగే ప్రతి ఒక్కరిపై అదనంగా రూ.2 వేలకు పైనే చేతి చమురు వదులుతోంది. శివారు మున్సిపల్‌ సర్కిళ్లలో ఈ దందా ఎక్కువగా ఉందన్న ఫిర్యాదులందుతున్నాయి.

ఇవీచూడండి: 'సాంకేతికతతోనే సమర్థ నీటి యాజమాన్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.