ETV Bharat / city

Railway Thefts: ఒకేలా రెండు దొంగతనాలు.. తీర్పులు మాత్రం వేర్వేరు.. ఎందుకంటే?

రిజర్వేషన్ బోగీలో ప్రయాణికుల సొత్తు చోరీకి గురైతే రైల్వే శాఖ బాధ్యత ఉంటుందా...? చోరీకి గురైన సొత్తును రైల్వే శాఖనే చెల్లించాలా..? ఈ వివాదంపై హైదరాబాద్​లోని రెండు వేర్వేరు జిల్లా వినియోగదారుల కమిషన్లు.. ఒక రోజు వ్యవధిలో రెండు భిన్నమైన తీర్పులను వెల్లడించాయి. చోరీకి గురైన సొత్తు విలువతో పాటు పరిహారాన్ని రైల్వే శాఖ ప్రయాణికుడికి చెల్లించాల్సిందేనని ఓ కమిషన్ స్పష్టం చేయగా.. రైల్వేకు బాధ్యత లేదని మరో కమిషన్ తేల్చి చెపింది.

author img

By

Published : Aug 14, 2021, 10:46 PM IST

Updated : Aug 14, 2021, 10:54 PM IST

Consumer Commission different Judgments on two same type of railway thefts

రైలు బోగీలో చోరీపై 2018లో దాఖలైన రెండు పిటిషన్లపై ఇటీవల హైదరాబాద్​లోని రెండు వినియోగదారుల కమిషన్లు.. ఒక్క రోజు వ్యవధిలో రెండు భిన్నమైన నిర్ణయాలు వెల్లడించాయి. హైదరాబాద్ జిల్లా రెండో వినియోగదారుల కమిషన్ దక్షిణ మధ్య రైల్వేను తప్పు పట్టగా... హైదరాబాద్ జిల్లా ఒకటో వినియోగదారుల కమిషన్ రైల్వే శాఖ బాధ్యత లేదని పేర్కొంది.

కేసు- 1:

హైదరాబాద్​లోని డీడీ కాలనీకి చెందిన శీతల్ కులకర్ణి.. బెంగళూరులో తన మరదలి ఎంగేజ్​మెంట్ కోసం 2017 ఆగస్టు 11న కాచిగూడ- యశ్వంత్​పురా ఎక్స్​ప్రెస్​లో రిజర్వేషన్ బోగీలో బయలుదేరారు. యశ్వంత్ పురాలో 12న దిగిన తర్వాత.. బ్యాగులోని ఎంగేజ్​మెంట్ ఉంగరాలు సహా 530 గ్రాముల బంగారం, రూ.3 లక్షల నగదు, పట్టుచీరలు కనిపించలేదు. బ్యాగులను కింది భాగంలో కత్తిరించినట్లు గుర్తించడంతో.. యశ్వంత్ పురా గ్రామీణ రైల్వే పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన సొత్తును వెతికి పట్టుకోవడంలో రైల్వే పోలీసులు విఫలం కావడం వల్ల... 2019 మార్చి 18న హైదరాబాద్ జిల్లా రెండో వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్​ను ఆశ్రయించారు.

భద్రత కల్పించటంలో విఫలమని...

రిజర్వేషన్ కోసం అదనపు ఛార్జీలు కూడా వసూలు చేసిన రైల్వే శాఖ.. ప్రయాణికుల లగేజీకి తగిన భద్రత కల్పించడంలో విఫలమైందని శీతల్ కులకర్ణి వాదించారు. రాజన్​కుంట వద్ద ముగ్గురు అనాధికార వ్యక్తులు బోగీలోకి ఎక్కారని.. వారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. రైల్వే శాఖ నిర్లక్ష్యాన్ని సేవా లోపంగా గుర్తించి.. దొంగతనానికి గురైన రూ.3 లక్షలు, నగల కోసం 15 లక్షల రూపాయలతో పాటు.. మానసిక వేదన కలిగించినందుకు రూ.లక్ష పరిహారం, ఖర్చుల కింద మరో రూ.10 వేలు చెల్లించేలా దక్షిణ మధ్య రైల్వే జీఎంను ఆదేశించాలని కోరారు.

రైల్వేకు సంబంధం లేదని...

పిటిషనర్ వాదనను దక్షిణ మధ్య రైల్వే జీఎం తోసిపుచ్చారు. వ్యక్తిగత లగేజీకి ప్రయాణికులదే బాధ్యత అని.. రైల్వేది కాదని ఓ వాదన. లగేజీని బుక్ చేయలేదని.. వాటిలో ఏమున్నాయో రైల్వే శాఖకు తెలపలేదు కాబట్టి.. తమ బాధ్యత కాదన్నారు. కేసును రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని జీఆర్​పీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నందున.. రైల్వే పరిధిలోకి రాదని మరో వాదన. యశ్వంత్ పురా గ్రామీణ రైల్వే పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైనందున.. హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ పరిధిలోకి రాదని దక్షిణ మధ్య రైల్వే వాదన. చోరీ జరిగినట్లు గుర్తించిన ఆరు గంటల తర్వాత ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఇరువైపుల వాదనలు విన్న హైదరాబాద్ జిల్లా రెండో వినియోగదారుల కమిషన్ ప్రెసిడెంట్ వక్కంటి నరసింహారావు, సభ్యులు పీవీటీఆర్ జవహర్ బాబు, ఆర్ఎస్ రాజశ్రీతో కూడిన బెంచ్ ఈనెల 3న తీర్పు వెల్లడించింది.

రక్షణ కల్పించటంలో విఫలమైనందున...

కాచిగూడ నుంచి యశ్వంత్ పురా మధ్యలో చోరీ జరిగింది కాబట్టి.. హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ పరిధిలోకి వస్తుందని పేర్కొంది. రైల్వే ప్రయాణికుడు వినియోగదారుడే కాబట్టి... పిటిషన్ విచారణార్హమేనని తేల్చింది. ముగ్గురు అనధికార వ్యక్తులు బోగీకి ప్రవేశించకుండా అడ్డుకోవడంలో రైల్వే శాఖ విఫలమైందని కమిషన్ పేర్కొంది. బోగీలోని ఇతర ప్రయాణికులు, టీటీఈ, ఇతర సిబ్బంది వివరాలను కూడా రైల్వే శాఖ సమర్పించలేక పోయిందని తెలిపింది. రిజర్వేషన్ కోచ్​లో రైల్వే గైడ్ ప్రకారం తగినంత రక్షణ, జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైనట్లు కమిషన్ పేర్కొంది. రైల్వే చట్టంలోని సెక్షన్ 100 ప్రకారం నిర్వర్తించాల్సిన బాధ్యతల్లోనూ విఫలమైందని తెలిపింది. ప్రయాణికురాలు శీతల్ కులకర్ణికి చోరీకి గురైన రూ.3లక్షలను 9 శాతం వార్షిక వడ్డీతో, బంగారం, వెండి ఆభరణాల కోసం మరో రూ.14,01,078లు 45 రోజుల్లో చెల్లించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎంను హైదరాబాద్ జిల్లా రెండో వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. ప్రయాణికురాలికి మానసిక వేదన కలిగించినందుకు రూ.50 వేలు, ఖర్చుల కింద మరో రూ.5 వేలు చెల్లించాలని జిల్లా కమిషన్ ఆదేశించింది.

consumer-commission-different-judgments-on-two-same-type-of-railway-thefts
లగేజీ పోవటం రైల్వే అధికారుల వైఫల్యమే.. పరిహారం ఇవ్వాల్సిందే..!

కేసు- 2:

సికింద్రాబాద్ ఓల్డ్​ బోయినపల్లికి చెందిన కమలేష్ వర్మ మే 25న థర్డ్ ఏసీ బోగీలో.. ముంబయి నుంచి హైదరాబాద్ వచ్చేందుకు 2017 మే 2న టికెట్లు రిజర్వేషన్ చేసుకున్నారు. మే 26న తెల్లవారు జామున రైలు లాథూర్ దాటిన తర్వాత తన బ్యాగు కింది భాగం కత్తిరించి అందులోని ఆభరణాలు చోరీ అయినట్లు గుర్తించారు. రైలు హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఆమె తన భర్తకు సమాచారం ఇచ్చారు. అప్పుడు ఇతర ప్రాంతంలో ఉన్న ఆమె భర్త హైదరాబాద్ వచ్చాక 2017, జూన్ 7న నాంపల్లి రైల్వే పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. రైల్వే శాఖ సేవా లోపం వల్ల తన ఆభరణాలు చోరీ అయ్యారని హైదరాబాద్ జిల్లా ఒకటో వినియోగదారుల కమిషన్​కు 2018 సెప్టెంబరు 25న ఫిర్యాదు చేశారు. రైల్వే శాఖదే బాధ్యతగా ప్రకటించి.. రూ.97,500లు, మానసిక వేదన కలిగించినందుకు రూ.70 వేలు, ఖర్చుల కింద రూ.30 వేలు చెల్లించేలా ఆదేశించాలని కోరారు. దక్షిణ మధ్య రైల్వే తరఫున డిప్యూటీ చీఫ్ కమర్షియల్ మేనేజర్ బీవీ రాంప్రసాద్ వినియోగదారుల కమిషన్​కు లిఖితపూర్వక వివరణ ఇచ్చారు.

ప్రయాణికులదే బాధ్యత...

వ్యక్తిగత లగేజీకి ప్రయాణికులదే బాధ్యత అని.. రైల్వేది కాదని పేర్కొన్నారు. బుక్ చేసుకున్న లగేజీకి మాత్రమే రైల్వే బాధ్యత ఉంటుందన్నారు. చోరీ అయినట్లు గుర్తించిన 12 రోజుల తర్వాత ఫిర్యాదు చేశారని.. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని పిటిషన్ కొట్టివేయాలని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న హైదరాబాద్ జిల్లా ఒకటో వినియోగదారుల కమిషన్ ప్రెసిడెంట్ పి.కస్తూరి, సభ్యుడు కె.రామ్మోహన్​తో కూడిన ధర్మాసనం.. ఈనెల 4న తీర్పు వెల్లడించింది. ప్రయాణికురాలు తన లగేజీని బుక్ చేసి ఉంటే.. రైల్వే శాఖ బాధ్యత ఉండేదని వినియోగదారుల కమిషన్ పేర్కొంది. బ్యాగులో ఏమేమి ఉన్నాయో ముందుగా రైల్వే శాఖకు తెలిపి బుక్ చేయలేదని పేర్కొంది. చోరీ లాథూరు వద్ద జరిగిందని.. 12 రోజుల తర్వాత నాంపల్లి రైల్వే స్టేషన్​లో ఫిర్యాదు చేశారని వివరించింది. కాబట్టి దక్షిణ మధ్యరైల్వేను తప్పుపట్టలేమంటూ పిటిషన్​ను కొట్టివేసింది.

లగేజీ పోతే బాధ్యత మాది కాదు...!

ఇదీ చూడండి:

జవాబుల జిరాక్సులతో పరీక్షా కేంద్రానికి విద్యార్థులు..

Last Updated : Aug 14, 2021, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.