ETV Bharat / city

మూసీ కాలుష్యం.... వెల కట్టలేని నష్టం

నగరం నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో భయంకరమైన కాలుష్యాన్ని నింపుకొని ప్రవహిస్తున్న మూసీ.. దిగువన కల్లోలం సృష్టిస్తోంది. తాగే నీరు, పీల్చే గాలి, తినే తిండి కూడా కలుషితమౌతోంది. రైతులు పంటలు పండించలేని పరిస్థితి ఏర్పడింది. పండిన పంటలు తినలేని దుస్థితి. పచ్చగా కనిపించే చేన్లు... పాలిచ్చే పాడిపశువులు కూడా మూసీ కాలుష్యకోరల్లో చిక్కుకుని అల్లాడుతున్నాయి.

cons with moosi pollution in hyderabad
మూసీ కాలుష్యం.... వెల కట్టలేని నష్టం
author img

By

Published : Dec 18, 2019, 5:42 PM IST

మూసీ కాలుష్యం.... వెల కట్టలేని నష్టం

నాడు నగరానికి వరప్రదాయినిగా భావించిన మూసీ నది.... ప్రస్తుతం ఎన్నో గ్రామాలకు దుఃఖదాయినిగా మారింది. కలుషిత జలాలు కేవలం మూసీనదికే పరిమితం కాలేదు. ఆ కాలుష్య జలాలు భూమి పొరల్లోకి చొచ్చుకుపోయి, కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు నాశనమౌతున్నాయి. పదుల సంఖ్యలో పరిసర గ్రామాలు సర్వనాశనమవుతున్నాయి. 48 గ్రామాల్లో బోరుబావులు, చేతిపంపులు, ఇతర నివాస బోర్లలో ఆర్సినిక్, నైట్రేట్, కోబాల్డ్, కాడ్మియం, నికిల్, యురేనియం వంటి ప్రమాదకర లోహాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

కాలుష్య రసాయనాలు, లోహాలతో నిండిన భూగర్భ జలాలు...

ఇప్పటికే మూసీనదిలో ఎక్కడ చూసినా బండరాళ్లపై కాలుష్యపు మరకలు కనిపిస్తున్నాయి. అవన్నీ ఎరుపు రంగుకు మారిపోయి ఉంటాయి. మూసీకి రెండు వైపులా సుమారు 5 కిలోమీటర్ల మేర కాలుష్య ప్రభావం కన్పిస్తోంది. 3 కిలోమీటర్ల పరిధిలో అయితే... తీవ్రత మరింత అధికంగా ఉంటోంది. ప్రమాదకర రసాయనాలు, లోహాలతో నిండిపోయిన భూగర్భ నీటిని వినియోగించడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆకుకూరలు తింటే అంతే సంగతులు...

మూసీ జలాలనే దిగువనున్న రైతులు సాగుకు వినియోగిస్తున్నారు. వరితోపాటు తోటకూర, పాలకూర, కొత్తిమీర, పుదీనా, మెంతికూర లాంటి ఆకుకూరలు పండిస్తున్నారు. మూసీ ఒడ్డున ఉండే భూముల్లో బోర్లు వేసి ఆ కాలుష్య జలాలతోనే పంటలు పండిస్తున్నారు. ఆ నీటితో పెరిగిన ఆకుకూరల్లో రసాయన అవశేషాలు ఎక్కువ స్థాయిలో ఉన్నట్లు స్వయంగా వ్యవసాయ శాఖ ఓ పరిశోధనలో బయటపెట్టింది. అయినా గత్యంతరం లేని రైతులు ఆకుకూరల సాగును వదలడం లేదు. నగరవాసులూ వాటిని తెలియకుండానే తింటున్నారు.

ఒకప్పుడు వరి పండించేవారు....

మూసీ పరివాహక ప్రాంతంలోని గ్రామాల రైతులంతా ఆ జలాలతోనే వరి పండించేవారు. 1970 వరకు దిగుబడులు బాగా ఉండేవి. మూసీనీటిని నిల్వ చేసుకుని, పంటలకు మళ్లించేందుకు వీలుగా నిజాం కాలంలో అడ్డుకట్టలు నిర్మించారు. వీటినే కత్వాలు అంటారు. ఆ నీటిని కాల్వల ద్వారా మళ్లించి రైతులు సాగు చేసుకునేవారు. క్రమంగా ఈ కత్వాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. నారాయణరావు కత్వా, రావిర్యాల కత్వాల కింద 10 వేల ఎకరాల ఆయకట్టు సాగయ్యేది.

గేదెలు తినేవి.. అదే గడ్డి...

మూసీ చుట్టూ అధికశాతం గడ్డి భూములున్నాయి. గతంలో వరి పండించిన భూముల్లోనే ప్రస్తుతం గడ్డి సాగుచేస్తున్నారు. దీనికి కూడా కలుషిత నీరే ఆధారం. మూసీ గడ్డికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పీర్జాదీగూడ, బాచారం, మర్రిపల్లి, గౌరెల్లి, బండరావిరాలల్లో పెద్దఎత్తున గడ్డి వ్యాపారం సాగుతోంది. ఒక డీసీఎం గడ్డి 30 వేల ధర పలుకుతోంది. నగర పరిసరాల్లోని పాల డెయిరీలు ఈ గడ్డిని కొనుగోలు చేస్తున్నాయి. ఈ గడ్డి తిన్న గేదెల పాలు నగరవ్యాప్తంగా సరఫరా అవుతున్నాయి. వాటిలో కూడా రసాయన అవశేషాలున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

కలుషిత జలాలు మూసీ ఒడ్డున కల్లోలం సృష్టిస్తుంటే ఆ జలాలనే కొందరు వ్యాపారంగా మలుచుకుంటున్నారు. మూసీనది పరివాహకంలో పర్వతాపూర్, కాచవాని సింగారం, కొర్రెముల, ఎదుల్లాబాద్ ఇలా ప్రతి గ్రామంలో కలుషిత నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. బోర్ల వద్ద ట్యాంకర్ల యజమానులు 100 రూపాయలకు నీటిని తీసుకెళ్ళి, సమీప ప్రాంతాల్లో 500 నుంచి 700 రూపాయల వరకు విక్రయించి కలుషిత నీటిని సైతం సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Wednesday, 18 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0229: US A Christmas Carol Content has significant restrictions, see script for details 4245244
Guy Pearce and Joe Alwyn star in the new FX/BBC version of Charles Dickens, 'A Christmas Carol'
AP-APTN-0055: ARCHIVE Teresa Giudice AP Clients Only 4245245
'Real Housewives of New Jersey' star and husband separate after nearly 20 years of marriage
AP-APTN-1535: UK James May Man in Japan Content has significant restrictions, see script for details 4245174
James May is 'Our Man in Japan' in a new travel series which sees him try his hand at calligraphy and professional snowball fights
AP-APTN-1435: UK CE James May Japan Pt 1 Content has significant restrictions, see script for details 4245163
James May discusses what he loves about Japan, ahead of the release of his new show 'Our Man in Japan'
AP-APTN-1426: US Star Wars Farewell AP Clients Only 4245150
For many 'Rise of Skywalker' filmmakers, saying goodbye to 'Star Wars' was bittersweet
AP-APTN-1417: UK Little Women Content has significant restrictions, see script for details 4245156
Timothee Chalamet, Florence Pugh, Greta Gerwig and Saoirse Ronan share behind the scenes moments of 'Little Women'
AP-APTN-1215: US Star Wars Fisher AP Clients Only 4245120
To include Princess Leia in 'Rise of Skywalker,' filmmakers worked with unused footage of the late Carrie Fisher from 'Force Awakens' and 'Last Jedi'
AP-APTN-1153: UK Little Women Christmas Content has significant restrictions, see script for details 4245110
The cast of 'Little Women' including Timothee Chalamet and Saoirse Ronan discuss Christmas gift buying and holiday traditions
AP-APTN-1056: US Breakthrough Zack Gottsagen Content has significant restrictions, see script for details 4245111
2019 Breakthrough: Actor Zack Gottsagen: 'Everything is going on right now'
AP-APTN-1040: US Breakthrough Barbie Ferreira Content has significant restrictions, see script for details 4245105
While euphoric about 'breakthrough' award, actress Barbie Ferreira already asks, 'what else?'
AP-APTN-1030: US Star Wars Fans AP Clients Only 4245096
In 'Star Wars' costumes, fans attend 'Skywalker' world premiere
AP-APTN-1028: US Star Wars Arrivals AP Clients Only 4245074
Original and current 'Star Wars' trilogy casts converge on carpet at 'Skywalker' world premiere
AP-APTN-1009: US CE Clint Eastwood Content has significant restrictions, see script for details 4245100
Clint Eastwood's project he's most proud of: His one act play from school
AP-APTN-1009: US CE Ackie Tran Content has significant restrictions, see script for details 4245099
A 'Star Wars' friendship for Naomi Ackie and Kelly Marie Tran
AP-APTN-0928: US Star Wars Interviews AP Clients Only 4245079
At 'Skywalker' premiere, Daisy Ridley teaches how to handle a lightsaber and John Boyega looks ahead to life after 'Star Wars'
AP-APTN-0924: US Cats World Premiere Content has significant restrictions, see script for details 4245088
At ‘Cats’ world premiere, Sir Andrew Lloyd Webber talks of unusual concept transforming T.S. Eliot poems into the beloved musical, calls Taylor Swift ‘Absolutely fantastic’
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.