ETV Bharat / city

పోలీసు నియామకాల్లో అవకతవకలు... సచివాలయానికి బాధితులు! - protest at secreteriate

పోలీస్ నియామకాల్లో అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. కటాఫ్ కంటే ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ... తాము ఎంపిక కాకపోవడానికి కారణాలు తెలపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పోలీసు నియామకాల్లో అవకతవకలు... న్యాయం చేయాలని విజ్ఞప్తి
author img

By

Published : Sep 26, 2019, 10:54 PM IST

పోలీసు నియామకాల్లో అవకతవకలు... న్యాయం చేయాలని విజ్ఞప్తి

పోలీస్ నియామకాల్లో అవకతవకలు జరిగినందున... కటాఫ్ కంటే ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ... తాము ఎంపిక కాలేదని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. హోమంత్రి మహమూద్​ అలీకి ఫిర్యాదు చేసేందుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్​ కృష్ణయ్యతో కలిసి సచివాలయానికి వచ్చారు. మంత్రిని ఫోన్​లో సంప్రదించగా... శుక్రవారం నాడు మంత్రుల నివాస ప్రాంగణం వద్ద తనను కలవాలని సూచించారు. కటాఫ్ మార్కుల కంటే ఎక్కువ మార్కులు వచ్చిన తమ పేర్లు జాబితాలో లేవని... పరీక్ష రాసిన వారందరి మార్కులు వెల్లడించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. తమ నుంచి ఎలాంటి రుసుము తీసుకోకుండా తమ అనుమానాలు నివృత్తి చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో నిరుద్యోగులకు ప్రతిసారి అన్యాయం జరుగుతోందని, ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని సమగ్ర విచారణ జరిపించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: అక్రమ తవ్వకాలపై గవర్నర్​ను కలిసిన భాజపా బృందం

File : TG_Hyd_69_26_Constable_Candidates_ABs_3053262 From : Raghu Vardhan Note : Feed from Secretariat OFC ( ) పోలిస్ కాన్ స్టేబుల్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని... కటాఫ్ కంటె ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ తాము ఎంపిక కాలేదని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. హోంమంత్రి మహమూద్ అలీని కలిసేందుకు వారు సచివాలయానికి వచ్చారు. వారికి మద్ధతుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కూడా సచివాలయం వద్దకు వచ్చారు. సచివాలయంలో మంత్రి అందుబాటులో లేకపోవడంతో ఫోన్ లో మాట్లాడారు. రేపు మంత్రుల నివాస ప్రాంగణం వద్ద తనను కలవాలని మహమూద్ అలీ సూచించారు. కటాఫ్ మార్కుల కంటె ఎక్కువ మార్కులు వచ్చిన తమ పేర్లు జాబితాలో లేవని... పరీక్ష రాసిన వారందరి మార్కులు వెల్లడించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. తమ నుంచి ఎలాంటి రుసుము తీసుకోకుండా వివరణ ఇవ్వాలని, అనుమానాలు నివృత్తి చేయడంతో పాటు న్యాయం చేయాలని అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఫలితాల్లో అవకవతకలు జరిగాయన్న ఆర్.కృష్ణయ్య... నిరుద్యోగులకు ప్రతిసారి అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని కాన్ స్టేబుల్ ఫలితాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పోలీస్ నియామక బోర్డు వెంటనే అవకతవకలను సరిదిద్దుకోవాలని కోరారు. బైట్ - కాన్ స్టేబుల్ అభ్యర్థులు బైట్ - ఆర్.కృష్ణయ్య, బి.సి. సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.