భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం అన్ని రాష్ట్రాల పీసీసీలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగానే నేటి నుంచి ఆన్‌లైన్ ద్వారా "స్పీకప్ ఫర్ డెమోక్రసీ'' కార్యక్రమాన్ని చేపట్టాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పీసీసీ అధ్యక్షులకు సూచించారు. దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలపై, రాజ్యాంగ విలువలపై భాజపా దాడులు చేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. కొవిడ్ మహమ్మారితో ప్రజలంతా భయాందోళన చెందుతున్న వేళ భాజపా మాత్రం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. నిరసన కార్యక్రమాల్లో కొవిడ్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించేట్లు చూడాలని స్పష్టం చేశారు.
భాజపా తీరుకు నిరసనగా కాంగ్రెస్ 'స్పీకప్ ఫర్ డెమోక్రసీ'
భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చెేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. నేటి నుంచి ఆన్‌లైన్ ద్వారా "స్పీకప్ ఫర్ డెమోక్రసీ'' కార్యక్రమాన్ని చేపట్టాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పీసీసీ అధ్యక్షులకు సూచించారు.