Telangana budget session : శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో నిబంధనలను పాటించకుండా.. ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించిందని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రభుత్వ తీరును తప్పబట్టింది. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టడంపై కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. తన సభ్యులకు పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద మైక్ ఇవ్వకుండా నిబంధలను తుంగలో తొక్కారని విమర్శించింది. విపక్ష సభ్యులకు కనీస గౌరవం ఇవ్వకుండా సభను ఏకపక్షంగా నడుపుతున్నారంటూ నిరసన తెలిపిన కాంగ్రెస్ శాసనసభాపక్షం.. సభ నుంచి వాకౌట్ చేసింది.
భాజపా సభ్యులు సస్పెండ్..
శాసన సభలో మంత్రి హరీశ్‌రావు బడ్జెట్ ప్రవేశపెడుతుండగా.. భాజపా సభ్యులు ఈటల రాజేందర్, రఘునందర్రావు, రాజాసింగ్.. అడ్డుతగులుతున్నారంటూ వారిని సభ నుంచి సస్పెండ్ చేసింది. భాజపా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలంటూ.. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తీర్మానం ప్రవేశపెట్టగా.. సభ ఆమోదించింది. దీనిపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటన చేశారు. ఈ సెషన్ పూర్తయ్యే వరకు భాజపా సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీచూడండి: Telangana Budget 2022-23 : రూ.2.56 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్