ETV Bharat / city

ఈనెల 30న హుజూరాబాద్​ కాంగ్రెస్​ అభ్యర్థి ఎంపిక - తెలంగాణ వార్తలు

ఈనెల 30న హుజూరాబాద్​ కాంగ్రెస్​ అభ్యర్థి ఎంపిక జరగనుంది. ఆ రోజు ముఖ్యనేతలు సమావేశమై అభ్యర్థిని ఎంపిక చేస్తారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి తెలిపారు. 29న కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్​ కరీంనగర్​ జిల్లాలో పర్యటించనున్నారు.

congress
కాంగ్రెస్
author img

By

Published : Aug 28, 2021, 3:26 AM IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల బరిలో నిలిచే కాంగ్రెస్​ అభ్యర్థి ఎవరో ఈనెల 30న తేలనుంది. ఆ రోజు ముఖ్యనేతలు సమావేశమై అభ్యర్థిని ఎంపిక చేస్తారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి తెలిపారు. ఈనెల 28వ తేదీన రాత్రి కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్​ హైదరాబాద్​కు వస్తారని.. 29న కరీంనగర్​ జిల్లాలో పర్యటిస్తారని చెప్పారు.

అక్కడ పార్లమెంటరీ స్థాయి కాంగ్రెస్ నాయకుల సమావేశంలో పాల్గొంటారని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. ప్రతి శనివారం జరగాల్సిన కాంగ్రెస్‌ సమావేశం సోమవారానికి వాయిదా పడిందని వివరించారు. ఈనెల 30వ తేదీన రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, సీనియర్‌ ఉపాధ్యక్షులు, వివిధ విభాగాల ఛైర్మన్లతోపాటు పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ సీఎల్పీలు, సీనియర్‌ నేతలు అంతా పాల్గొనే సమావేశంలో చర్చించిన తరువాత అభ్యర్థి ఎంపికపై ఓ నిర్ణయానికి వస్తామని వివరించారు.

ఇదీ చదవండి: REVANTH: 'కేసీఆర్‌ రాజీనామా చేస్తే గజ్వేల్‌లో పోటీకి నేను సిద్ధం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.