మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై వస్తున్న ఆరోపణలపై వేగంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం మియాపూర్ ప్రభుత్వ భూములను(miyapur lands) కొల్లగొట్టిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతురావు ప్రశ్నించారు. కీసరలో ఎస్సీ,ఎస్టీల అసైన్డ్ భూములను కబ్జా చేసినా చర్యలు లేవని ఆరోపించారు.
భూములు కబ్జా చేస్తూ...కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని వీహెచ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా...రాష్ట్రంలో జరిగిన అన్ని భూ అవకతవకలపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కబ్జా భూములను స్వాధీనం చేసుకుని అందులో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించాలని డిమాండ్ చేశారు.