కొత్త పార్టీలు వస్తుంటాయ్.. పోతుంటాయని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. వైఎస్ వారసులమని ఎవరు చెప్పుకున్నా... కాంగ్రెస్ కార్యకర్తలే ఆయన వారసులన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టవచ్చని షబ్బీర్ అలీ అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వంపై 15వ ఆర్థిక సంఘం తీవ్రమైన ఆరోపణలు చేసిందని షబ్బీర్ అలీ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కాంట్రాక్టర్లు లాభం పొందారు తప్ప రైతులకు ఒరిగిందేమిలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ తప్పిదాలు బయటపడతాయనే స్టేట్ ఫైనాన్స్ కమిషన్‌ను ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదని షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాళేశ్వరం కమిషన్‌ల ప్రాజెక్టని రుజువైందని షబ్బీర్ అలీ తెలిపారు. తప్పుడు రెవెన్యూ చూపి రుణాలు తెచ్చినట్లు ఫైనాన్స్ కమిషన్ చెప్పిందని.. ఇది చాలా పెద్ద నేరమన్నారు. దీనిపై కేంద్రం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేశారని విమర్శించారు. వీసీల నియామకం చేయాలని ఆదేశించిన గవర్నర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి : తెలంగాణలో రాజన్న రాజ్యం మళ్లీ తీసుకొస్తా: వైఎస్ షర్మిల