ETV Bharat / city

కేసీఆర్​ ఆరోగ్యంపై హెల్త్​ బులిటెన్​ విడుదల చేయాలి: గూడూరు - సచివాలయం కూల్పివేతపై గూడురు స్పందన

కేసీఆర్​ ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బులిటెన్‌ విడుదల చేయాలని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి డిమాండ్​ చేశారు. కరోనా పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు.

GUDURU NARAYANA REDDY
కేసీఆర్​ ఆరోగ్యంపై హెల్త్​ బులిటెన్​ విడుదల చేయాలి: గూడూరు
author img

By

Published : Jul 8, 2020, 2:23 PM IST

ముఖ్యమంత్రి ఆరోగ్యంపై సామాజిక మాద్యమాల్లో రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి అన్నారు. సీఎం ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బులిటెన్‌ విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. కేసీఆర్​ గురించి రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని తెలిపారు.

సచివాలయం కూల్చివేతపైనా గూడూరు స్పందించారు. ఇప్పటికిప్పుడు కూల్చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా భవనాలు కొవిడ్​ ఆస్పత్రిగా వాడుకునేందుకు అనువుగా ఉండేవని అభిప్రాయపడ్డారు. పోలీసు బలగాలను మోహరించి కూల్చేయడం ఏంటని నిలదీశారు.

కరోనా చికిత్స పేదలకు ఆర్థిక భారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆస్పత్రులపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వల్ల భారీగా బిల్లులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కరోనా పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని గూడూరు ఆరోపించారు. ఏపీలో 11 లక్షలు పరీక్షలు చేస్తే.. రాష్ట్రంలో కేవలం లక్ష పరీక్షలే చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇవీచూడండి: ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీపీఐ నారాయణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.