ETV Bharat / city

ఆర్టీసీ ఛలో ట్యాంక్​బండ్​కు కాంగ్రెస్​ సంపూర్ణ మద్దతు - tsrtc updates

హైదరాబాద్​ రాజ్​భవన్​లో కాంగ్రెస్​ నేతలు గవర్నర్‌ను కలిశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వైఫల్యాలపై తమిళిసైకి ఫిర్యాదు చేశారు. రేపటి ఆర్టీసీ జేఏసీ ఛలో ట్యాంక్​బండ్​ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతిస్తున్నామని పేర్కొన్నారు. సమ్మె వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. తక్షణమే కార్మికుల డిమాండ్లు పరిష్కారించాలని విజ్ఞప్తి చేశారు.

ఆర్టీసీ చలో ట్యాంక్​బండ్​కు కాంగ్రెస్​ సంపూర్ణ మద్దతు
author img

By

Published : Nov 8, 2019, 3:19 PM IST

Updated : Nov 8, 2019, 4:33 PM IST

రేపటి ఆర్టీసీ జేఏసీ ఛలో ట్యాంక్​బండ్​ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతిస్తున్నామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వైఫల్యాలపై రాజ్​భవన్​లో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఆర్టీసీ సమ్మె, ఇతర అంశాలను తమిళిసై దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వివరించారు. ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరించొద్దని హైకోర్టు స్టే విధించటాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. మోదీ, కేసీఆర్​లు వ్యవహరిస్తున్న తీరువల్ల పరిశ్రమలు దివాళా తీస్తున్నాయని భట్టి పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఆర్థిక విధానాల కారణంగా తిరిగి బంగారం అమ్ముకుని పరిపాలన చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి ఆర్సీ కుంతియా ఆరోపించారు.

ఆర్టీసీ చలో ట్యాంక్​బండ్​కు కాంగ్రెస్​ సంపూర్ణ మద్దతు

తెరాస ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందో ప్రజలకు వివరిస్తామని కాంగ్రెస్​ నేతలు అన్నారు. ఆర్టీసీ సమ్మె వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. తక్షణమే ప్రభుత్వం కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: ఆర్టీసీలో ప్రైవేట్ బస్సులకు అనుమతిపై స్టే

Last Updated : Nov 8, 2019, 4:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.