ETV Bharat / city

భూముల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడికి కాంగ్రెస్‌ నిర్ణయం

దేవాదాయ, అసైన్డ్‌భూముల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. తాజా రాజకీయ పరిణామాలపై జూమ్‌ యాప్‌లో ఆ పార్టీ శాసనసభాపక్షం సమావేశమైంది. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితోనే కరోనా కేసులు, మృతులు పెరిగాయని సీఎల్పీ అభిప్రాయపడింది.

author img

By

Published : May 5, 2021, 5:31 PM IST

Congress decision to put pressure on government over endowment  and assigned lands issue
భూముల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడికి కాంగ్రెస్‌ నిర్ణయం

దేవదాయ, అసైన్డ్‌ భూముల విషయంలో సమగ్ర విచారణకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. జూమ్‌ యాప్‌లో అత్యవసరంగా సమావేశమైన కాంగ్రెస్‌ శాసనసభాపక్షం తాజా రాజకీయ పరిణామాలపై సమీక్షించింది. అధికార తెరాస పార్టీలో కొనసాగుతున్న రాజకీయ పరిణామాలు... అసైన్డ్‌, ఆలయ భూముల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి తదితర అంశాలను సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.

దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్​కు చెందిన అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కరోనా కట్టడిలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించడం వల్లే కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి: దేవరయాంజల్ ఆలయ భూకబ్జాలపై విచారణకు కమిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.