కాంక్రీట్ డే సందర్భంగా ఈనెల 7న కాంక్రీట్ ఎక్స్లెంట్ అవార్టులు అందించనున్నట్లు ఇండియా కాంక్రీట్ ఇనిస్టిట్యూట్ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదిత్య బిర్లా గ్రూప్ సహకారంతో హైదరాబాద్ అమీర్‌పేట్‌లో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఔట్ స్టాండింగ్ కాంక్రీట్ స్ట్రక్చర్, అమెజాన్‌కు ఉత్తమ స్ట్రక్చర్ అవార్డుకు ఎంపికచేశామని పేర్కొన్నారు. జిల్లాల్లోని నిర్మాణాలకు, ఉత్తమ ఇంజినీర్లకు అవార్టులు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి: జాతీయ 'ప్రఖ్యాత సంస్థ'గా హైదరాబాద్ విశ్వవిద్యాలయం